
మరో తెలుగు హీరో తండ్రి కాబోతున్నాడు. అయితే అతడు ఈ విషయాన్ని బయటపెట్టలేదు. 'బలగం' ఫేమ్ కావ్య కల్యాణ్ రామ్.. ఈ శుభకార్యానికి వెళ్లింది. కాబోయే తల్లిదండ్రులకు విషెస్ చెబుతూ పోస్ట్ పెట్టింది. అలా ఈ గుడ్ న్యూస్ అందరికీ తెలిసింది. దీంతో సదరు హీరోకి నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు)
తెలుగు సినిమాల్లో హీరోగా, సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు తిరువీర్. తెలంగాణకు చెందిన ఈ కుర్రాడు.. 'మసూద' మూవీతో మంచి ఫేమ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఒకటి రెండు చిత్రాల్లో హీరోగా చేస్తున్నాడు. 2016 నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఇతడు.. ఘాజీ, మల్లేశం, జార్జ్ రెడ్డి, పలాస, టక్ జగదీష్, మసూద, పరేషాన్, మోక్షపటం సినిమాలు చేశాడు. పర్లేదనిపించేలా గుర్తింపు తెచ్చుకున్నాడు.
వ్యక్తిగత విషయానికొస్తే గతేడాది కల్పన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఏడాది మార్చిలో సొంతూరిలో కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాడు. 'రెండు దశాబ్దాల కల, అమ్మ చివరి కోరిక' అని తన ఇంటి ఫొటోలని కూడా షేర్ చేశాడు. ఇప్పుడు తిరువీర్ భార్య కల్పన ప్రెగ్నెన్సీతో ఉంది. సోమవారం నాడు సీమంతం వేడుక చేశారు. ఈ ఫొటోలని కావ్య కల్యాణ్ రామ్ షేర్ చేసింది. అలా తిరువీర్ తండ్రి కాబోతున్న విషయం అందరికీ తెలిసింది.
(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'కోర్ట్' దర్శకుడు.. అమ్మాయి ఎవరంటే?)
