Robinhood: ‘రాబిన్‌హుడ్‌’ మూవీ ట్విటర్‌ రివ్యూ | Nithiin Robinhood Movie Twitter Review And Public Talk In Telugu, Check These Tweets Before Watching Film | Sakshi
Sakshi News home page

Robinhood Twitter Review: నితిన్‌ ‘రాబిన్‌హుడ్‌’ మూవీ టాక్‌ ఎలా ఉందంటే?

Mar 28 2025 6:37 AM | Updated on Mar 28 2025 8:13 AM

Robinhood Movie Twitter Review,Public Talk In Telugu

హీరో నితిన్ గత కొంత కాలంగా వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్నాడు. ఆయన ఖాతాలో ఇటీవలి కాలంలో ఒక్క హిట్ సినిమా కూడా లేదు. ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’, ‘మాచర్ల నియోజకవర్గం’, ‘మాస్ట్రో’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమవడంతో నితిన్ మార్కెట్ బాగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఆయన తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’తో గట్టి కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నాడు.

 వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హీస్ట్ కామెడీ చిత్రంలో నితిన్‌కి జోడీగా శ్రీలీల నటించింది. ఆస్ట్రేలియా క్రికెటర్‌ డెవిడ్‌ వార్నర్‌ ఓ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ప్రచారచిత్రాలకు మంచి స్పందన లభించింది. దానికి తోడు సినిమా ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(మార్చి 28) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘రాబిన్‌హుడ్‌’కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.

రాబిన్‌హుడ్‌ చిత్రానికి ఎక్స్‌లో  మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొందరు అంటుంటే...యావరేజ్‌ అని మరికొంతమంది కామెంట్‌ చేస్తున్నారు. 

 ఇప్పుడే సినిమా చూశాను. సెకండాఫ్‌ బాగుంది. శ్రీలీల పోర్షన్‌ మినహా ప్రతి ఎపిసోడ్‌ బాగా వర్కౌట్‌ అయింది. డేవిడ్‌ వార్నర్‌ క్యామియో రోల్‌ చివరిలో వచ్చి నవ్వులు పూయిస్తోంది. అదిదా సర్‌ప్రైజ్‌ సాంగ్‌ బాగుంది. ఓవరాల్‌గా ఇది డీసెంట్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ అని ఓ నెటిజన్‌ 2.5 రేటింగ్‌ ఇచ్చాడు.

 ‘ఫస్టాఫ్‌ బాగుంది. సెకండాఫ్‌ బాగోలేదు. భీష్మతో పోలిస్తే మాత్రం ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి’ అని ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు.

‘సమ్మర్‌ ఫుల్‌ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. రాజేంద్రప్రసాద్‌, నితిన్‌ పాత్రలు పండించిన కామెడీ సినిమాకు ప్రధాన బలం. ఓ సింపుల్‌స్టోరీని వెంకీ కుడుముల తనదైన కామెడీ సీన్లతో, స్క్రీన్ ప్లేతో చక్కగా  తీర్చిదిద్దాడు’ అంటూ ఓ నెటిజన్‌ 3.5 రేటింగ్‌చ్చాడు.

రాబిన్‌హుడ్‌ బాగుంది. ఫస్టాఫ్‌ కంటే సెకండాఫ్‌ బెటర్‌. డేవిడ్‌ భాయ్‌ ఎంట్రీకి థియేటర్స్‌లో రీసౌండే. కామెడీ బాగుంది. అదిదా సర్‌ప్రైజ్‌ మినహా మిగతా పాటల ప్లేస్‌మెంట్స్‌ బాగోలేవు. ఓవరాల్‌గా గుడ్‌ మూవీ అని ఓ వ్యక్తి ట్విటర్‌లో రాసుకొచ్చాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement