
ఈ మధ్య సీనియర్ హీరో జగపతిబాబు కొత్తగా టాక్ షోను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అందులో శ్రీలీల తన తల్లితో కలిసి పాల్గొంది. కాగా ఈ షోలో శ్రీలీలకు రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ ఒకేసారి కాల్షీట్లు అడిగితే ముందు ఎవరికి కాల్షీట్ ఇస్తావ్? అనే ప్రశ్న ఎదురైంది.
దానికి శ్రీలీల ఎప్పట్లానే తన స్టైల్‌లో గడసరి సమాధానం చెప్పింది. ఈ ఇద్దరి కోసం రెండు షిఫ్టులు పనిచేస్తుందట. ఇక మహేష్ బాబు, రవితేజలో ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారనే ప్రశ్నకు రవితేజ పేరు చెప్పింది.
పెళ్లి సందD మూవీతో వెండితెరపై హీరోయిన్‌గా శ్రీలీల ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ధమాకా, గుంటూరు కారం, భగవంత్ కేసరి, స్కంద, రాబిన్‌హుడ్, జూనియర్.. ఇలా అనేక సినిమాలు చేసింది. పుష్ప 2లో 'కిస్ కిస్ కిస్సిక్..' అనే ఐటం సాంగ్‌లోనూ ఆడిపాడింది. జూనియర్ మూవీలోని వైరల్ వయ్యారి పాటతో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. తాజాగా రవితేజ సరసన నటించిన మాస్ జాతర త్వరలోనే రిలీజ్ కానుంది.