
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల కొద్దిరోజుల క్రితం ఒక చిన్నపాపతో ఉన్న ఫోటోను తన సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. తమ కుటుంబంలోకి కొత్త వ్యక్తి వచ్చేసిందని క్యాప్షన్ పెట్టడంతో ఆమె మరో బిడ్డను దత్తత తీసుకున్నారేమో అని అందరూ అనుకున్నారు. సుమారు మూడేళ్ల క్రితం ఆమె ఓ అనాథశ్రమాన్ని సందర్శించినప్పుడు దివ్యాంగులైన గురు, శోభిత అనే ఇద్దరు పిల్లల పరిస్థితి చూసి చలించిపోయింది. ఆ సమయంలో వారిని దత్తత తీసుకుంది. దీంతో తాజాగా మరో పాపను కూడా శ్రీలీల దత్తత తీసుకున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే, ఆ ఫోటోలోని పాప గురించి చెబుతూ తాజాగా శ్రీలీల మరో పోస్ట్ షేర్ చేసింది.
ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే శ్రీలీల కాస్త విరామం దొరకగానే చిన్నపాపతో సరదాగా ఆడుకుంటూ కనిపించింది. ఆ పాప వివరాలు చెప్పాలని చాలామంది నెటిజన్లు కామెంట్ల రూపంలో శ్రీలీలను కోరడంతో తాజాగా సమాధానం చెప్పింది. ఆ పాప తన సోదరి కూతురు అని శ్రీలీల క్లారిటీ ఇచ్చింది. నా సోదరి కూతురు వల్ల మా ఇల్లు అంతా కొత్తగా ఉంది. ముఖ్యంగా ఈ పిన్నిలో మరింత జోష్ నింపింది' అని ఇన్‌స్టా స్టోరీస్‌లో తెలిపింది.
పుష్ప2 సినిమాలో ప్రత్యేకమైన సాంగ్‌లో మెప్పించిన శ్రీలీల పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో ఒక సినిమాలో నటిస్తుంది. కార్తిక్ ఆర్యన్ హీరోగా అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీ సమయంలోనే కార్తిక్ - శ్రీలీల మధ్య ప్రేమ మొదలైందని వార్తలు వచ్చాయి. అయితే, ఈ విషయంపై వారు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.