అనిల్‌ రావిపూడి మల్టీస్టారర్‌.. హీరోయిన్లు ఫిక్స్‌, వెంకీతో తొలిసారి..! | Keerthy Suresh And Krithi Shetty To Star In Anil Ravipudi, Venkatesh And Kalyan Ram Multistarer, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

అనిల్‌ రావిపూడి మల్టీస్టారర్‌.. ‘సంక్రాంతి’ హీరోయిన్లు ఫిక్స్‌.. వెంకీతో తొలిసారి!

Mar 26 2026 9:58 AM | Updated on Mar 26 2026 11:13 AM

Keerthy Suresh And Krithi Shetty To Star In Anil Ravipudi, Venkatesh And Kalyan Ram Multistarer

వెంకటేశ్‌–కల్యాణ్‌ రామ్‌ హీరోలుగా ఓ క్రేజీ మల్టీస్టారర్‌ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్లు ఎవరు? అనే విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. అయితే వెంకటేశ్‌–కల్యాణ్‌ రామ్‌లకు సరైన జోడీ కోసం అనిల్‌ రావిపూడి వేట మొదలెట్టారట. ఇందులో భాగంగా ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. వెంకటేశ్‌కి జోడీగా ‘మహానటి’ మూవీ ఫేమ్‌ కీర్తీ సురేష్‌ నటించనున్నారనే వార్తలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఇప్పటివరకూ వెంకటేశ్‌–కీర్తీ సురేష్‌ కలిసి నటించలేదు. వీరి కాంబినేషన్‌ అయితే ప్రేక్షకులకు కొత్తగా ఉంటుందనే ఆలోచనతో ముందుకెళుతున్నారట అనిల్‌ రావిపూడి.

ఇక కల్యాణ్‌ రామ్‌కి జోడీగా నటించనున్న హీరోయిన్ల జాబితాలో ప్రధానంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో కృతీ శెట్టి, కయాదు లోహర్‌ ఉన్నారు. ‘ఉప్పెన, శ్యామ్‌ సింగరాయ్, బంగార్రాజు’ వంటి పలు హిట్‌ సినిమాలతో ప్రేక్షకుల్లో గుర్తింపు సొంతం చేసుకున్న కృతీ శెట్టి పేరు బలంగా వినిపిస్తోంది. అలాగే ‘డ్రాగన్, అల్లూరి, ఫంకీ’ చిత్రాల ఫేమ్‌ కయాదు లోహర్‌ పేరు కూడా తెరపైకి వచ్చింది. మరి... వెంకటేశ్‌కి జోడీగా కీర్తి నటిస్తారా? లేదా? కల్యాణ్‌ రామ్‌కి జంటగా కృతీ, కయాదు లోహర్‌లలో ఎవరు ఫైనల్‌ అవుతారు? లేకుంటే మరో హీరోయిన్‌ ఫిక్స్‌ అవుతారా? అనే విషయాలపై స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. ఈ సినిమా 2027 సంక్రాంతికి రిలీజ్‌ కానుంది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement