ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా | Rani Mukerji Mardaani 3 ott release date announced | Sakshi
Sakshi News home page

ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా

Mar 26 2026 8:17 AM | Updated on Mar 26 2026 9:53 AM

Rani Mukerji Mardaani 3 ott release date announced

బాలీవుడ్‌ నటి రాణి ముఖర్జీ  నటించిన కొత్త చిత్రం 'మర్దానీ 3' ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. అభిరాజ్‌ మినావాలా దర్శకత్వంలో యష్‌ రాజ్‌ ఫిల్మ్స్‌పై ఆదిత్యా చోప్రా నిర్మించారు.  ‘‘మర్దానీ (2014), మర్దానీ 2 (2019)’ వంటి విజయాల తర్వాత ప్రేక్షకులకు సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌ను ఇచ్చేలా ‘మర్దానీ 3’ తెరకెక్కించారు. ఈ ఏడాది జనవరిలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద ప్రేక్షకులను మెప్పించింది.

'మర్దానీ 3' మార్చి 27న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. కేవలం హిందీ వర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఇతర రీజనల్‌ భాషల్లో ఉండదు. ఈ ఫ్రాంచైజీలో అత్యధిక వసూళ్లు సాధించిన పార్ట్‌-3లో జానకి బోడివాలా, జిషు సేన్‌గుప్తా, ఇంద్రనీల్ సేన్‌గుప్తా సహాయ పాత్రలలో నటించారు. ఇందులో రాణి ముఖర్జీ.. శివానీ శివాజీరాయ్‌ అనే పోలీసు పాత్రలో కనిపించారు.

మహిళల అక్రమ రవాణా, కిడ్నాప్‌ వంటి అంశాలతో ‘మర్దానీ’, ‘మర్దానీ 2’ చిత్రాలు హిట్‌ సాధించాయి. అయితే, పార్ట్‌-3లో ఎనిమిది నుంచి పదేళ్ల వయసున్న 93 మంది చిన్నపిల్లల కిడ్నాప్ కేసును ఛేదించడం కనిపిస్తుంది.  భయంకరమైన బిచ్చగాళ్ల మాఫియాతో పాటు ఒక ప్రాణాంతకమైన మెడికల్ ఎక్స్‌పెరిమెంట్ గుట్టును శివాని శివాజీరాయ్‌ ఎలా ప్రపంచానికి తెలిపారనేది ఈ కథ. 
 

Advertisement
 
Advertisement
Advertisement