ఆల్‌టైమ్‌ డిజాస్టర్‌గా ఉస్తాద్‌ భగత్‌సింగ్‌.. | Ustaad Bhagat Singh Is Now All Time disaster collections | Sakshi
Sakshi News home page

ఆల్‌టైమ్‌ డిజాస్టర్‌గా ఉస్తాద్‌ భగత్‌సింగ్‌.. డిస్ట్రిబ్యూటర్స్‌పై పిడుగు

Mar 26 2026 10:52 AM | Updated on Mar 26 2026 11:01 AM

Ustaad Bhagat Singh Is Now All Time disaster collections

'ఉస్తాద్ భగత్ సింగ్' బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైందని పూర్తి లెక్కలతో వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశి ఖన్నా నటించిన ఈ మూవీని దర్శకుడు హరీష్‌ శంకర్‌ తెరకెక్కించారు. సుమారు. 150 కోట్లకు పైగా బడ్జెట్‌తో    మైత్రీ మూవీస్‌ సంస్థ  నిర్మించింది. అయితే, సినిమా విడుదలై వారం గడిచినప్పటికీ కలెక్షన్స్‌పై కనీసం ఒక్క పోస్టర్‌ కూడా నిర్మాతలు విడుదల చేయలేదు. అందుకు ప్రధాన కారణం సినిమా ఫలితమేనని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. అయితే,  ట్రేడ్ వెబ్‌సైట్ సక్నిల్క్ బాక్సాఫీస్‌ గణాంకాల ప్రకారం చూస్తే  ఆల్‌టైమ్‌ డిజాస్టర్‌గా ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ నిలిచిపోయింది.

'ఉస్తాద్ భగత్ సింగ్' నష్టాల దెబ్బ నిర్మాతల కంటే డిస్ట్రిబ్యూటర్స్‌పైనే ఎక్కువ పడింది. భారీ ధరకు కొనుగోలు చేసిన వారు పెట్టుబడిలో కనీసం సగం కలెక్షన్స్‌ కూడా తెచ్చుకోలేకపోయారు. ఓవర్సీస్‌లో ఉస్తాద్‌ను విడుదల చేసేందుకు డిస్ట్రిబ్యూటర్స్‌ ఎవరూ ముందుకు రాకపోవడంతో మైత్రీ మూవీస్‌ వారే రిలీజ్‌ చేశారు. ఆపై సీడెడ్‌, కర్ణాటకలతో పాటు ఏపీలో కూడా  పేలవంగా కలెక్షన్స్‌ రాబట్టింది.

పెట్టుబడిలో సగం కూడా రాలేదు
ట్రేడ్ వెబ్‌సైట్ సక్నిల్క్ ప్రకారం ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ మొదటి వారం రూ. 65.74 కోట్ల నెట్‌ సాధించింది. ఏడోరోజు కేవలం కోటి రూపాయలు మాత్రమే రాబట్టడంతో పవన్‌ కల్యాణ్‌ మార్కెట్‌ సత్తా ఇంతేనా అంటూ ట్రోల్స్‌ మొదలయ్యాయి.  ఈ ప్రకారం ట్రెండ్‌ చూస్తే రూ. 70 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌తో ఉస్తాద్‌ ప్రయాణం ముగిసిపోవడం దాదాపు ఖాయం. 

ఒక్క నైజాం ఏరియాలోనే దాదాపు రూ. 30 కోట్ల నష్టం రావచ్చని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కోసం సుమారు రూ. 115 కోట్లు పెట్టుబడి పెట్టారని సమాచారం. అయితే, ఏడురోజుల్లో రూ. 50 కోట్లు మాత్రమే రికవరీ అయినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిచోట ఈ మూవీకి పెట్టిన పెట్టుబడిలో సగం కలెక్షన్స్‌ కూడా రాబట్టలేకపోయింది. దీంతో భారీ నష్టాలను ఎదుర్కొవాల్సిన పరిస్థితి డిస్ట్రిబ్యూటర్స్‌కు ఏర్పడింది.

పవన్‌ గత సినిమా 'ఓజీ' కేవలం నాలుగు రోజుల్లోనే రూ.130 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు సృష్టించింది. కానీ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఫైనల్‌ కలెక్షన్స్‌ కూడా రూ.100 కోట్ల మైలురాయిని  చేరలేకపోవడం కష్టమే.. ఆశ్చర్యకరంగా, ఈ చిత్రం ఉత్తర అమెరికాలో 1 మిలియన్ డాలర్‌ కంటే తక్కువ వసూలు చేసింది. ఇది దాని ఘోరమైన ప్రదర్శనను స్పష్టం చేస్తోంది. ఈ మధ్య విడుదలైన డిజాస్టర్‌ సినిమాలు అఖండ -2, హరి హర వీర మల్లు చిత్రాలు కూడా  1 మిలియన్ డాలర్ల మార్కును దాటాయి. కానీ, 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆ మైలురాయిని చేరుకోవడంలో విఫలమైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement