శ్రీలీల పెళ్లి కాదు.. అసలు నిజం ఇది | Actress Sreeleela Gives Clarity On Her Engagement Pics Which Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Sreeleela: పెళ్లి కూతురిలా శ్రీలీల.. క్లారిటీ ఇదిగో

Jun 1 2025 3:26 PM | Updated on Jun 1 2025 4:22 PM

Sreeleela Clarify Her Engagement Pics

యంగ్ హీరోయిన్ శ్రీలీల.. తాజాగా ఇంట్లో సెలబ్రేషన్స్ అని కొన్ని ఫొటోలు చేసింది. దీంతో ఈమెకు నిశ్చితార్థం జరిగిందా? పెళ్లెప్పుడు? అబ్బాయి ఎవరు? అని ఇలా రకరకాల ప్రశ్నలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ విషయమై తెగ మాట్లాడుకున్నారు. ఇంకా ఊరుకుంటే ఇది చాలా దూరం వెళ్తుందేమోనని ఊహించిన శ్రీలీల.. మొత్తానికి ఈ ఫొటోలపై క్లారిటీ ఇచ్చేసింది.

'నా ముందస్తు పుట్టినరోజు వేడుకల్ని ఇట్లో మేం ఈ విధంగానే సెలబ్రేట్ చేసుకున్నాం. దీనికి సంబంధించిన ప్లానింగ్ అంతా అమ్మ చూసుకున్నారు' అని శ్రీలీల చెప్పింది. దీంతో పాటు ఓ నాలుగైదు ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ వేడుకల్లో నటుడు రానా భార్య మిహిక పాల్గొనడం విశేషం.

(ఇదీ చదవండి: పరమశివుడిగా సూపర్‌స్టార్ కృష్ణ.. పోస్టర్ చూశారా?)

ఈ ఫొటోలు చూసి శ్రీలీల ఎంగేజ్‌మెంట్ అని అందరూ అనుకోవడానికి ఓ కారణముంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో కార్తీక్ ఆర్యన్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్న ఈమె.. సదరు హీరోతో డేటింగ్‌లో ఉందని, త్వరలో పెళ్లి చేసుకుంటారనే రూమర్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే శ్రీలీల తాజా ఫొటోలు చూసి అందరూ షాకయ్యారు. క్లారిటీ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు.

'పెళ్లి సందD' మూవీతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల.. వరస సినిమాలు చేసింది. చివరగా 'రాబిన్ హుడ్' చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం అఖిల్ 'లెనిన్'లో నటిస్తోంది. అలానే పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'లోనూ ఈమెనే హీరోయిన్.

(ఇదీ చదవండి: నిఖిల్ పాన్ ఇండియా మూవీ.. ఇన్నాళ్లకు అప్‌డేట్)

Advertisement
 
Advertisement
Advertisement