
స్ప్రింగులా బాడీని కదిలిస్తూ అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడు టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). సింగిల్ టేక్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్న తారక్.. డ్యాన్స్‌లోనూ టాప్ హీరోగా తనకు తిరుగు లేదని నిరూపించుకున్నాడు. అయితే డ్యాన్స్ ఇరగదీస్తున్న హీరోయిన్ శ్రీలీలకు తారక్ ఆదర్శమట! ఈ విషయాన్ని ఆమె తల్లి డాక్టర్ స్వర్ణలత చెప్పుకొచ్చింది. జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకి శ్రీలీల హాజరైంది.
అప్పుడే డిసైడయ్యా..
శ్రీలీల (Sreeleela) గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పేందుకు ఆమె తల్లి స్వర్ణలత కూడా వేదికపై వచ్చింది. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆమె ప్రస్తావించింది. తారక్ చిన్నప్పుడు కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చిన ఫోటోను జగపతిబాబు చూపించాడు. అది చూసిన స్వర్ణలత.. నాకు ఆడపిల్ల పుడితే డ్యాన్స్ నేర్పించాలని ఈ ఫోటో చూశాకే డిసైడ్ అయ్యాను.

ఎన్టీఆర్‌తో మాట్లాడా..
1997లో లాస్ ఏంజిల్స్‌లో తానా సభలు జరిగాయి. మేము అక్కడికి వెళ్లాం. అక్కడ తారక్ డ్యాన్స్ చేశాడు. అనంతరం తారక్‌తో మాట్లాడాను. నాకు అమ్మాయి పుడితే కచ్చితంగా నీలా డ్యాన్స్ చేయిస్తాను అని చెప్పాను. అనుకున్నట్లుగానే నా కూతురిని డ్యాన్సర్ చేశాను అని తెలిపింది. జూనియర్ ఎన్టీఆర్ స్ఫూర్తితోనే శ్రీలీల మంచి డ్యాన్సర్ అయిందని పేర్కొంది.
సినిమా
శ్రీలీల.. పెళ్లి సందD మూవీతో వెండితెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ధమాకా, గుంటూరు కారం, భగవంత్ కేసరి, జూనియర్.. ఇలా అనేక సినిమాలు చేసింది. పుష్ప 2లో 'కిస్ కిస్ కిస్సిక్..' అనే ఐటం సాంగ్‌లోనూ ఆడిపాడింది. జూనియర్ మూవీలోని వైరల్ వయ్యారి పాటతో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈమె రవితేజ సరసన నటించిన మాస్ జాతర త్వరలోనే రిలీజ్ కానుంది.
Im Saying N'th Time
Your Biggest Strength is Dance bro @tarak9999
Nee Dance Inspiration Valla TFI ki #Sreeleela lanti No.1 Lady Dancer Dorikindipic.twitter.com/0aIdnKpr5N— Saleem Tarak💙 (@Tarak_Holic) August 23, 2025
చదవండి: అజిత్ భాయ్.. ఏంటా స్పీడ్.. ఇదేమైనా రేసింగ్ అనుకున్నావా?