
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఈ ఏడాది రెండు చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన విదాముయార్చి బాక్సాఫీస్ వద్ద అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ మాత్రం సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మించింది. ఈ మూవీలో అజిత్ సరసన త్రిష హీరోయిన్గా నటించింది.
ఇక సినిమాల సంగతి పక్కనపెడితే అజిత్ కుమార్కు కార్ రేసింగ్ అంటే ఇష్టమన్న సంగతి తెలిసిందే. విదేశాల్లో ఎక్కడ రేసింగ్ జరిగినా తన టీమ్తో సహా వాలిపోతుంటారు. ఈ ఏడాదిలో ఇప్పటికే పలు కార్ రేసింగుల్లో టైటిల్స్ సాధించారు. అంతేకాదు కొన్ని సినిమాల్లో ఏకంగా కారుతో రియల్ స్టంట్స్ కూడా చేశారు. డూప్ లేకుండానే చాలాసార్లు కారుతో స్టంట్స్ చేశారు.
తాజాగా అజిత్కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. కారును ఏకంగా 232 కిలోమీటర్ల స్పీడ్తో నడుపుతూ కనిపించారు. ఎవరికైనా వంద స్పీడ్కే గుండెల్లో గుబులు మొదలవుతుంది. అలాంటి ఏకంగా 232 కిలోమీటర్లు స్పీడ్తో దూసుకెళ్లడమంటే మామూలు విషయం కాదు. కార్ రేసింగ్ల్లో దూసుకెళ్లే అజిత్కు ఈ స్పీడ్ ఒక లెక్కేనా అని అందరికీ అనిపించి ఉండొచ్చు. కానీ అంతవేగంతో వెళ్లాలంటే కాస్తా గుండె ధైర్యం కూడా ఉండాలి. అయితే ఈ వీడియో ఇప్పటిదా.. పాతదా అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ఇది చూసిన తలా ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Ajith Kumar FULL SPEED RACING VIDEO!😎🔥Is this possible-aa!? 😯🔥
#AjithKumar #AK64 #GoodBadUgly pic.twitter.com/NrKM9nQ2Cr— nallurwood (@nallurwood) August 22, 2025