
హీరోయిన్లకు మొదట ఒకే ఒక్క ఛాన్స్ వస్తుంది. అదృష్టం కలిసొచ్చి ఆ మూవీ హిట్ అయితే తర్వాత అవకాశాలు వెల్లువలా వస్తాయి. కాయదు లోహార్ పరిస్థితి ఇప్పుడు అలానే ఉన్నట్లు కనిపిస్తోంది. 2021లో కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత తెలుగులోనూ 'అల్లూరి' అనే మూవీ చేసింది. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. గతేడాది తమిళంలో వచ్చిన 'డ్రాగన్'.. ఈమె కెరీర్‌ని మలుపు తిప్పేసింది. దీంతో ప్రస్తుతం తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో నాలుగైదు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది.
(ఇదీ చదవండి: వీడియో: పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ.. ముఖంలో పెళ్లికళ)
తమిళంలో ఇదయం మురళి అనే సినిమా చేయగా.. ఇది విడుదలకు సిద్ధమైంది. తెలుగులోనూ విశ్వక్ సేన్ 'ఫంకీ'లో ఈమెనే హీరోయిన్. ఇప్పుడు తమిళంలో విశాల్ సరసన ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలొస్తున్నాయి. దర్శకుడు సుందర్.సి-విశాల్ కాంబోలో ఈ ఏడాది 'మదగజరాజా' వచ్చింది. హిట్ అయింది. దీంతో ఇప్పుడు రిపీట్ కాబోతున్న కాంబోలోకి కాయదు వచ్చి చేరినట్లు తెలుస్తోంది.
సుందర్.సి చిత్రాల్లో హీరోయిన్లకు ప్రాముఖ్యత ఉంటుంది. అలానే ఒకరికి మించి హీరోయిన్లు ఉంటారు. గ్లామర్ కూడా అధిక మోతాదులోనే ఉంటుంది. త్వరలో విశాల్ హీరోగా తీయబోయే సినిమాలో ఇద్దరు బ్యూటీస్‌కి చోటు ఉంది. అందులో ఒక హీరోయిన్‌గా కాయదు లోహర్‌ని ఎంపిక చేసినట్లు సమాచారం. మరో హీరోయిన్ ఎంపిక జరుగుతున్నట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: పవన్ సినిమాలో మూడు కోట్ల ఆఫర్.. నేను ఒప్పుకోలేదు: మల్లా రెడ్డి)