
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) ఈ ఏడాది విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు. సినిమాలతో పాటు రేసింగ్‌లో దూసుకెళ్తోన్న స్టార్ హీరో.. తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు ఓ డిజార్డర్ ఉందని తెలిపారు. తనకు అస్సలు నిద్ర పట్టదని అజిత్ కుమార్ తెలిపారు. స్లీపింగ్ డిజార్డర్ వల్ల రోజుకు కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతానని వెల్లడించారు.
ఇది అధిగమించేందుకు ప్రయాణం చేసేటప్పుడు నిద్రించేందుకు ట్రై చేస్తానని అజిత్ అన్నారు. అంతేకాకుండా ఈ రోజుల్లో అద్భుతాలు చేయడానికి సోషల్ మీడియా గొప్ప సాధనంగా మారిందన్నారు. సామాజిక మాధ్యమాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని తెలిపారు. రేసింగ్‌లో ప్రమాదాలు జరగడం సర్వసాధారణమని విషయమన్నారు. అయితే కార్లను ప్రత్యేకంగా.. డ్రైవర్ భద్రతను దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తారని వెల్లడించారు. అందువల్ల ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలకు ముప్పు చాలా చాలా తక్కువని చెప్పారు.