
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ సినిమాలతో పాటు కార్ రేసింగ్లోనూ దూసుకెళ్తున్నారు. అటు సినిమాలు.. ఇటు రేసింగ్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇక లగ్జరీ కార్లు కొనుగోలు చేయడమంటే కూడా ప్రాణం. ఇప్పటికే ఆయన గ్యారేజ్లో ఇంటర్నేషనల్ బ్రాండ్ కార్లు చాలానే ఉన్నాయి. తాజాగా మరో హై ఎండ్ లగ్జరీ కారును తన గ్యారేజీకి జతచేశారు. ప్రముఖ షెవర్లే కంపెనీకి చెందిన కార్వెట్ సీ8-జడ్06ని కారును ఆయన కొనుగోలు చేశారు.
అయితే ఈ ఆధునాతన సౌకర్యాలు కలిగిన కారు ధర దాదాపు రూ.1.40 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా... ఈ సూపర్‌కారును దుబాయ్‌లోని షోరూమ్ నుంచి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
ఇక సినిమాల విషయానికొస్తే అజిత్ కుమార్ ప్రస్తుతం షూటింగ్స్కు కాస్తా గ్యాప్ ఇచ్చారు. గుడ్ బ్యాడ్ అగ్లీ సూపర్ హిట్ తర్వాత వేకేషన్కు వెళ్లారు. తన భార్యతో కలిసి విదేశాల్లో చిల్ అవుతున్నారు. కొత్త ఏడాదిలో విదాముయార్చి మూవీతో అభిమానులను అలరించిన అజిత్.. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన గుడ్ బ్యాడ్ అగ్లీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.