
రిషబ్ శెట్టి (Rishab Shetty)స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార చాప్టర్-1(Kantara Chapter 1) బాక్సాఫీస్ వద్ద అలరిస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే మూడు వందల కోట్ల మార్క్ దాటేసిన ఈ చిత్రం తాజాగా రూ.400 కోట్ల క్లబ్లో చేరింది. ఈ మూవీ రిలీజైన ఆరు రోజుల్లోనే అరుదైన మార్క్ చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.427 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
(ఇది చదవండి: 'నా జీవితం సర్వనాశనం చేశారు'.. బిగ్‌బాస్ సంజనా గల్రానీ ఆవేదన!)
కాంతార రికార్డ్ బ్రేక్..
ఈ క్రమంలోనే కాంతార చాప్టర్ 1 ప్రపంచవ్యాప్తంగా పలు రికార్డులను బద్దలు కొట్టింది. ఆరు రోజుల్లోనే కాంతార లైఫ్ టైమ్ కలెక్షన్స్ను దాటేసింది. కేజీఎఫ్- 2 తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ కన్నడ చిత్రంగా నిలిచింది. కాగా.. 2022లో విడుదలైన 'కాంతార' సినిమా రూ.408 కోట్ల ఆల్ టైమ్ వసూళ్లు రాబట్టింది. శాండల్‌వుడ్‌లో కన్నడ హీరో యశ్ నటించిన కేజీఎఫ్-2 ప్రపంచవ్యాప్తంగా రూ.1215 కోట్లతో మొదటిస్థానంలో ఉంది. కాంతార చాప్టర్-1 జోరు చూస్తుంటే వారం రోజుల్లోనే రూ.500 కోట్ల మార్క్ చేరుకునేలా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రం ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా కన్నడ, హిందీ, తెలుగు, మలయాళం, తమిళం, బెంగాలీ, ఆంగ్ల భాషల్లో రిలీజైన సంగతి తెలిసిందే.