
రిషబ్ శెట్టి (Rishab Shetty) డైరెక్షన్లో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ కాంతార. ఈ సినిమాకు ప్రీక్వెల్గా భారీ బడ్జెట్తో కాంతార చాప్టర్-1(Kantara Chapter 1) తెరకెక్కించారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చింది. రిలీజైన మొదటి రోజు నుంచే అద్భుతమైన కలెక్షన్స్తో దూసుకెళ్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే కాంతార మూవీ రికార్డ్ను బ్రేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.427 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
తాజాగా ఈ చిత్రం నుంచి బ్రహ్మ కలశ అనే ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ పాట థియేటర్లలో కాంతార ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సాంగ్కు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. అబ్బి ఆలపించారు. వరాహరూపం థీమ్‌తో వచ్చిన ఈ సాంగ్ థియేటర్లలో అభిమానులను అలరించింది. కాగా.. ఈ చిత్రానికి అజనీశ్ లోక్‌నాథ్ సంగీతమందించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కీలక పాత్రల్లో నటించారు.
A symphony of faith, a celebration of devotion 🔱🔥#Brahmakalasha Video Song from #KantaraChapter1 out now 🎵
▶️ https://t.co/wzi1h7ek5l#BlockbusterKantara in cinemas now!#KantaraInCinemasNow #DivineBlockbusterKantara #KantaraEverywhere #Kantara @hombalefilms @KantaraFilm… pic.twitter.com/VKVnnqXmrq— Hombale Films (@hombalefilms) October 8, 2025