
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు(Ajith Kumar) పెను ప్రమాదం తప్పింది. దుబాయ్‌లో జరుగుతున్న రేసింగ్‌లో ఆయన నడుపుతున్న కారు పక్కనే ఉన్న ట్రాక్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అజిత్‌కు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. రేసింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సంక్రాంతి బరిలో అజిత్..
కాగా.. అజిత్ కుమార్ హీరోగా ప్రస్తుతం ‘విడాముయర్చి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో అర్జున్ సర్జా ప్రధాన పాత్ర పోషించారు. లైకా ప్రోడక్షన్స్ బ్యానర్‌పై జీకేఎం తమిళ్ కుమరన్ నేతృత్వంలో సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా ఈ సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన విడాముయార్చి సినిమా టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో మా మూవీపై అంచ నాలు మరింతగా పెరిగాయి. ఈ చిత్రంలో ఆరవ్, రెజీనా కసండ్రా, నిఖిల్ నాయర్ కీలక పాత్రల్లో నటించారు.
మైత్రి మూవీ మేకర్స్‌తో మరో సినిమా..
అజిత్ కుమార్ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌తో జతకట్టారు. ఆయన హీరోగా తెరకెక్కిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఇందులోనూ త్రిషనే హీరోయిన్‌గా నటిస్తోంది . ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
వేసవిలో రిలీజ్..
ఈ మూవీని వేసవిలో ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అజిత్‌పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఇండియన్ మూవీ చరిత్రలోనే గుడ్ బ్యాడ్ అగ్లీ ఓ మైలురాయిగా నిలుస్తుందిని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందించారు. కాగా ఈ చిత్రాన్ని తొలుత సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వీలు కాకపోవడంతో ఏప్రిల్‌కు రిలీజ్ కానుంది.
Ajith Kumar’s massive crash in practise, but he walks away unscathed.
Another day in the office … that’s racing!#ajithkumarracing #ajithkumar pic.twitter.com/dH5rQb18z0— Ajithkumar Racing (@Akracingoffl) January 7, 2025