
ఈ మధ్య రష్మిక(Rashmika Mandanna ) పేరు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. ఒకపక్క కెరీర్..మరోపక్క పర్సనల్ విషయాల్లో రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి.ఇటీవల విజయ్ దేవరకొండతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. మరోవైపు రష్మిక నటించిన తాజా చిత్రం ‘థామా’(Thama)ని కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసినట్లు పుకార్లు వచ్చాయి. అక్టోబర్ 21న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అ
అయితే రష్మిక సొంత రాష్ట్రం అయిన కర్ణాటకలో మాత్రం విడుదల కాదని.. కన్నడ ఇండస్ట్రీ ఆమెను బహిష్కరించిందనే వార్తలు గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ రూమర్స్‌పై రష్మిక స్పందించింది. ఇప్పటివరకు తనను ఏ ఇండస్ట్రీ బ్యాన్ చేయలేదని వెల్లడించింది. అపార్థం చేసుకోవడం వల్లే ఇలాంటి పుకార్లు పుట్టుకొస్తాయని ఆమె అన్నారు.
ప్రతి విషయాన్ని ఆన్‌లైన్‌లో పంచుకోలేను
కన్నడ చిత్రం ‘కాంతార: చాప్టర్ 1’ ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. రిషబ్ శెట్టిని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కానీ అదే ప్రాంతానికి చెందిన రష్మిక మాత్రం ఈ చిత్రంపై స్పందించలేదు. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. తాజాగా దీనిపై రష్మిక స్పందించింది.
థామా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ..‘ఏ సినిమా రిలీజ్ అయినా..నేను రెండు, మూడు రోజుల్లోనే చూడలేను. కాంతార కూడా విడుదలైన కొన్ని రోజుల తర్వాత చూశాను. చిత్రబృందాన్ని అభినందిస్తూ మెసేజ్ కూడా చేశా. వాళ్లు నాకు ధన్యవాదాలు కూడా తెలిపారు. తెర వెనుక ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. మన వ్యక్తిగత విషయాలన్నీ కెమెరా ముందుకు తీసుకురాలేం కదా. ప్రతి విషయాన్ని ఆన్‌లైన్‌లో పంచుకునే వ్యక్తిని కాదు. . అందుకే ప్రజలు ఏమనుకున్నా పట్టించుకోను. వాళ్లు నా నటన గురించి ఏం మాట్లాడతారు అనేదే నాకు ముఖ్యం. దానిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాను’ అని రష్మిక అన్నారు.