breaking news
Thama Movie
-
Thamma Movie X Review: రష్మిక తొలి హారర్ మూవీ ‘థామా’ ఎలా ఉంది?
నేషనల్ క్రష్ రష్మిక(Rashmika Mandanna), బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించిన తాజా చిత్రం ‘థామా’. రొమాంటిక్ కామెడీ హారర్ చిత్రానికి ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించారు. నవాజుద్దీన్ సిద్దిఖీ, పరేశ్ రావెల్, సత్యరాజ్, ఫైజల్ మాలిక్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్ 21) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. సినిమా ఎలా ఉంది? రష్మిక ఖాతాలో హిట్ పడిందా లేదా తదితర విషయాలను ఎక్స్‌లో చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి.థామా చిత్రానికి ఎక్స్‌లో మిక్స్డ్ టాక్ వస్తుంది. సినిమా బాగుందని కొంతమంది అంటుంటే.. బాగోలేదని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇందులో రష్మిక బేతాళ జాతికి చెందిన యువతిగా నటించగా.. ఆయుష్మాన్ ఓ జర్నలిస్ట్‌గా నటించాడు. వైరల్ వీడియో కోసం స్నేహితులతో కలిసి హీరో అడవికి ట్రెకింగ్‌కి వెళ్లడం.. ఓ ప్రమాదం నుంచి తనను కాపాడిన బేతాళ జాతికి చెందిన యువతి(రష్మిక) చూసి ప్రేమలో పడడం.. వారి ప్రేమ ఎన్ని అనర్థాలకు దారి తీసింది అనేదే ఈ సినిమా కథ. కథగా చూస్తే ఇది కొత్తగా ఉన్నా.. తెరపై మాత్రం అంత వర్కౌట్ కాలేదని కొంతమంది నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. మ్యాడాక్ నిర్మాణ సంస్థ నుంచి హారర్ సినిమాల( స్త్రీ 2, భేడియా, ముంజ్యా) రేంజ్లో ఈ సినిమా ఆకట్టుకోలేకపోయిందని పలు వెబ్సైట్లు తమ రివ్యూలో పేర్కొన్నాయి. Movie Review- #Thamma Waowww⭐️⭐️⭐️⭐️⭐️it's a film that leaves you thoroughly entertained and completely satisfied.The direction is simply superb, showing a masterful understanding of how to captivate the audience and make the picture look good to everyone.Every single… pic.twitter.com/Df2SCECYBI— Love.prem98 (@LPrem98) October 18, 2025 ఈ సినిమాను ఫుల్లుగా ఎంజాయ్ చేశాను. దర్శకుడు ఆదిత్య తెరకెక్కించిన విధానం పింప్లీ సూపర్బ్.. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక పవర్ఫుల్ రోల్లో కనిపించారు. ఈ సినిమా హై ఎనర్జీతో తిర్చిదిద్దిన పర్ఫెక్ట్ దీవాళీ గిఫ్ట్ అని నెటిజన్ కామెంట్ చేశాడు.My Review of film #Thamma#Rating: ⭐⭐ (2/5)Director Aditya Sarpotdar’s latest offering, "Thamma", enters the arena aiming to be a standout horror-comedy, but tragically misses the mark, demonstrating a film devoid of both horror and comedy. Despite a compelling premise and…— KRK (@kamaalrkhan) October 21, 2025 దర్శకుడు ఓ అద్భుతమైన కామెడీ హారర్ కామెడీ చిత్రాన్ని తెరకెక్కించాలని ప్రయత్నించాడు. కానీ అటు హారర్‌తో భయపెట్టలేక..ఇటు కామెడీతో నవ్వించలేకపోయాడు. సాంకేతికంగా బాగున్నప్పటికీ.. కథకు సరైనా పునాది మాత్రం లేదు. అంచాలను అందుకోవడం సినిమా విఫలం అయిందంటూ ఓ నెటిజన్ 2.5 రేటింగ్ ఇచ్చాడు.#OneWordReview...#Thamma: TERRIFIC.Rating: ⭐⭐⭐⭐️#MaddockFilms delivers yet another winner… A delicious cocktail of humour, supernatural, and romance... Takes a completely uncharted path as far as the plot goes… EXPECT THE UNEXPECTED! #ThammaReviewDirector… pic.twitter.com/hkMow8xkXt— taran adarsh (@taran_adarsh) October 19, 2025#Thamma is a clean, colourful entertainer. The story isn’t perfect, but performances by #AyushmannKhurrana and #RashmikaMandanna keep it lively throughout. ⭐️⭐️⭐️½ pic.twitter.com/iJPUHsQOj8— Sushmita🥀🥂 (@memesaheb_) October 21, 2025#Thamma Movie Review"Thamma" is an engaging mix of emotion, drama, and unpredictability. The first half focuses on building the story a bit slow at times, but it sets the stage well. The second half, however, really picks up and delivers an impressive payoff.What truly… pic.twitter.com/3qAbhgsvkG— Cineholic (@Cineholic_india) October 20, 2025 -
కన్నడలో బ్యాన్.. స్పందించిన రష్మిక!
ఈ మధ్య రష్మిక(Rashmika Mandanna ) పేరు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. ఒకపక్క కెరీర్..మరోపక్క పర్సనల్ విషయాల్లో రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి.ఇటీవల విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. మరోవైపు రష్మిక నటించిన తాజా చిత్రం ‘థామా’(Thama)ని కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసినట్లు పుకార్లు వచ్చాయి. అక్టోబర్ 21న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అఅయితే రష్మిక సొంత రాష్ట్రం అయిన కర్ణాటకలో మాత్రం విడుదల కాదని.. కన్నడ ఇండస్ట్రీ ఆమెను బహిష్కరించిందనే వార్తలు గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ రూమర్స్‌పై రష్మిక స్పందించింది. ఇప్పటివరకు తనను ఏ ఇండస్ట్రీ బ్యాన్ చేయలేదని వెల్లడించింది. అపార్థం చేసుకోవడం వల్లే ఇలాంటి పుకార్లు పుట్టుకొస్తాయని ఆమె అన్నారు.ప్రతి విషయాన్ని ఆన్లైన్లో పంచుకోలేను కన్నడ చిత్రం ‘కాంతార: చాప్టర్ 1’ ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. రిషబ్ శెట్టిని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కానీ అదే ప్రాంతానికి చెందిన రష్మిక మాత్రం ఈ చిత్రంపై స్పందించలేదు. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. తాజాగా దీనిపై రష్మిక స్పందించింది. థామా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ..‘ఏ సినిమా రిలీజ్ అయినా..నేను రెండు, మూడు రోజుల్లోనే చూడలేను. కాంతార కూడా విడుదలైన కొన్ని రోజుల తర్వాత చూశాను. చిత్రబృందాన్ని అభినందిస్తూ మెసేజ్ కూడా చేశా. వాళ్లు నాకు ధన్యవాదాలు కూడా తెలిపారు. తెర వెనుక ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. మన వ్యక్తిగత విషయాలన్నీ కెమెరా ముందుకు తీసుకురాలేం కదా. ప్రతి విషయాన్ని ఆన్లైన్లో పంచుకునే వ్యక్తిని కాదు. . అందుకే ప్రజలు ఏమనుకున్నా పట్టించుకోను. వాళ్లు నా నటన గురించి ఏం మాట్లాడతారు అనేదే నాకు ముఖ్యం. దానిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాను’ అని రష్మిక అన్నారు. -
అప్పటికప్పుడే తీసుకున్న నిర్ణయమది: రష్మిక పోస్ట్ వైరల్
టాలీవుడ్లో ప్రస్తుతం ఆ ఇద్దరి పేర్లే తెగ వైరలవుతున్నాయి. ఆ జంట మరెవరో కాదు.. నేషనల్ క్రష్ రష్మిక.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఇటీవలే వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగినట్లు వార్తలొస్తున్నాయి. కానీ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటనైతే రాలేదు. వీరిద్దరిపై ఎప్పటి నుంచో డేటింగ్ రూమర్స్ వస్తున్నప్పటికీ ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వలేదు. తాజాగా నిశ్చితార్థం విషయంలోనూ అదే జరిగింది. ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.ఇక ఈ సంగతి పక్కన పెడితే రష్మిక నటించిన రెండు సినిమాలు రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. అందులో ఒకటి థామా.. మరొకటి ది గర్ల్‌ఫ్రెండ్. ఈ నేపథ్యంలో రష్మిక చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. లేటేస్ట్‌గా రిలీజైన థామా సాంగ్ గురించి రష్మిక పోస్ట్ పెట్టారు. ఆ సాంగ్ రూపొందించడం వెనక ఉన్న స్టోరీని వివరిస్తూ పోస్ట్ పెట్టారు. ఇదంతా దర్శకనిర్మాతలు అనుకోకుండా తీసుకున్న నిర్ణయమని తెలిపారు.ఆయుష్మాన్ ఖురానా హీరోగా వస్తోన్న థామా నుంచి ఇటీవల నువ్వు నా సొంతమా అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటలో రష్మిక తన అందంతో డ్యాన్స్‌తో అభిమానులను అలరించింది. తాజాగా ఈ పాట వెనక ఉన్న ఓ ఆసక్తికర విషయాన్ని ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.రష్మిక తన పోస్ట్‌లో రాస్తూ.. 'మేము ఓ అందమైన ప్రదేశంలో దాదాపు 12 రోజుల పాటు షూటింగ్ చేశాం. అయితే షూట్ చివరి రోజు మా దర్శకనిర్మాతలకు ఓ ఆలోచన వచ్చింది. ఈ ప్లేస్ ఇంత బాగుంది కదా మనం ఇక్కడ పాట ఎందుకు చేయకూడదని అన్నారు. ఆ ఆలోచన మా అందరికీ నచ్చింది. ఆ లొకేషన్ అందంగా ఉండడంతో మూడు, నాలుగు రోజుల్లోనే పాటను పూర్తి చేశాం. మేము ప్లాన్ చేసిన వాటికంటే ఇది చాలా బాగా వచ్చింది. ఈ పాటలో భాగమైన వారందరికీ అభినందనలు. మీరంతా కూడా థియేటర్లో ఈ సాంగ్‌ను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా' అంటూ సాంగ్ స్టిల్స్‌ను షేర్ చేశారు. కాగా.. ఈ హారర్ మిస్టరీ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రానికి ముంజ్య ఫేమ్ ఆదిత్య సర్పోత్థార్ దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
మా ప్రపంచం వేరు
ఆయుష్మాన్ ఖురానా, రష్మికా మందన్నా ప్రధానపాత్రల్లో నటించిన హారర్ మిస్టరీ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘థామా’. మడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఈ చిత్రానికి ‘ముంజ్య’ ఫేమ్ ఆదిత్య సర్పోత్థార్ దర్శకత్వం వహించారు. దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. ఈ చిత్రంలో అలోక్పాత్రలో ఆయుష్మాన్ ఖురానా, తడ్కాపాత్రలో రష్మికా మందన్నా నటించారు.ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శుక్రవారం ముంబైలో జరిగింది. శ్రద్ధా కపూర్ ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ని లాంచ్ చేశారు. ‘‘ఏ... నాటకాలు ఆపు... నీకేం కాలేదు, నా కొడుకు సైతాన్... సైతాన్, నేను నీతో ఉండలేను... మా ప్రపంచం వేరు’’ అని అర్థం వచ్చే డైలాగ్స్ ఈ హిందీ ట్రైలర్లో ఉన్నాయి. దీపావళి పండగ సందర్భంగా ‘థామా’ సినిమాను అక్టోబరు 21న రిలీజ్ చేయనున్నట్లుగా అధికారికంగా వెల్లడించారు. -
ఘోస్ట్‌గా 'థ్రిల్ చేయనున్న రష్మిక..!
-
స్త్రీ యూనివర్స్ లో శ్రీవల్లి
-
దెయ్యంగా రష్మిక.. 'వరల్డ్ ఆఫ్ థామా' చూశారా?
ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్లలో టాప్‌లో దూసుకుపోతున్న రష్మిక.. వరస సినిమాలతో బిజీగా ఉంది. ఈమె హిందీలో చేసిన లేటెస్ట్ మూవీ 'థామా'. 'స్త్రీ' యూనివర్స్‌లో భాగంగా వస్తున్న నాలుగో మూవీ ఇది. ఇంతకుముందు భేడియా, స్త్రీ, ముంజ్య చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకుల్ని అలరించాయి. ఇప్పుడు 'థామా' పేరుతో ఈ మూవీలో రష్మిక, ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించారు. తాజాగా టీజర్‌ని 'వరల్డ్ ఆఫ్ థామా' పేరుతో రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లోకి అనసూయ.. ఇదిగో క్లారిటీ)గతంలో రష్మిక చెప్పినట్లు అతీంద్రియ శక్తులతో కూడిన రొమాంటిక్ సినిమాగా 'థామా' తీశారు. టీజర్లో రష్మిక.. ఇదివరకు ఎన్నడూ చూడనటువంటి పాత్రలో కనిపించింది. బోల్డ్‌గా కనిపిస్తూనే భయపెట్టింది కూడా. ఇందులో రష్మిక, దెయ్యంగానూ యాక్ట్ చేసినట్లు అనిపిస్తుంది. ఈ సినిమాకు ఆదిత్య సర్పోట్దర్ దర్శకుడు. హారర్ స్టోరీ అయినప్పటికీ.. ప్రేమకథని కూడా చూపించబోతున్నారు. ఈ దీపావళికి మూవీ థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: తండ్రి కాబోతున్న తెలుగు యంగ్ హీరో.. భార్యకు సీమంతం)


