Thamma Movie X Review: రష్మిక తొలి హారర్‌ మూవీ ‘థామా’ ఎలా ఉంది? | Rashmika Mandanna Thamma Movie X Review, Public Talk | Sakshi
Sakshi News home page

Thamma Movie X Review: రష్మిక ‘థామా’ మూవీ టాక్‌ ఏంటి?

Oct 21 2025 2:09 PM | Updated on Oct 21 2025 3:15 PM

Rashmika Mandanna Thamma Movie X Review, Public Talk

నేషనల్‌ క్రష్‌ రష్మిక(Rashmika Mandanna), బాలీవుడ్‌ హీరో ఆయుష్మాన్‌ ఖురానా జంటగా నటించిన తాజా చిత్రం ‘థామా’. రొమాంటిక్ కామెడీ హారర్‌ చిత్రానికి ఆదిత్య సర్పోత్దార్‌ దర్శకత్వం వహించారు. నవాజుద్దీన్ సిద్దిఖీ, పరేశ్ రావెల్, సత్యరాజ్, ఫైజల్ మాలిక్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్‌ 21) మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. సినిమా ఎలా ఉంది? రష్మిక ఖాతాలో హిట్పడిందా లేదా తదితర విషయాలను ఎక్స్లో చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి.

థామా చిత్రానికి ఎక్స్లో మిక్స్‌డ్‌ టాక్‌ వస్తుంది. సినిమా బాగుందని కొంతమంది అంటుంటే.. బాగోలేదని మరికొంతమంది కామెంట్‌ చేస్తున్నారు.  ఇందులో రష్మిక బేతాళ జాతికి చెందిన యువతిగా నటించగా.. ఆయుష్మాన్‌  ఓ జర్నలిస్ట్‌గా నటించాడు. వైరల్‌ వీడియో కోసం స్నేహితులతో కలిసి హీరో అడవికి ట్రెకింగ్‌కి వెళ్లడం..  ఓ ప్రమాదం నుంచి తనను కాపాడిన బేతాళ జాతికి చెందిన యువతి(రష్మిక) చూసి ప్రేమలో పడడం.. వారి ప్రేమ ఎన్ని అనర్థాలకు దారి తీసింది అనేదే ఈ సినిమా కథ. 

కథగా చూస్తే ఇది కొత్తగా ఉన్నా.. తెరపై మాత్రం అంత వర్కౌట్‌ కాలేదని కొంతమంది నెటిజన్స్‌ అభిప్రాయపడుతున్నారు. మ్యాడాక్ నిర్మాణ సంస్థ  నుంచి హారర్సినిమాల( స్త్రీ 2, భేడియా, ముంజ్యా) రేంజ్‌లో ఈ సినిమా ఆకట్టుకోలేకపోయిందని పలు వెబ్‌సైట్లు తమ రివ్యూలో పేర్కొన్నాయి. 

 ఈ సినిమాను ఫుల్లుగా ఎంజాయ్‌ చేశాను. దర్శకుడు ఆదిత్య తెరకెక్కించిన విధానం పింప్లీ సూపర్బ్‌.. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించారు. ఈ సినిమా హై ఎనర్జీతో తిర్చిదిద్దిన పర్‌ఫెక్ట్ దీవాళీ గిఫ్ట్ అని నెటిజన్ కామెంట్ చేశాడు.

 దర్శకుడు ఓ అద్భుతమైన కామెడీ హారర్‌ కామెడీ చిత్రాన్ని తెరకెక్కించాలని ప్రయత్నించాడు. కానీ అటు హారర్‌తో భయపెట్టలేక..ఇటు కామెడీతో నవ్వించలేకపోయాడు. సాంకేతికంగా బాగున్నప్పటికీ.. కథకు సరైనా పునాది మాత్రం లేదు. అంచాలను అందుకోవడం సినిమా విఫలం అయిందంటూ ఓ నెటిజన్‌ 2.5 రేటింగ్‌ ఇచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement