
ఈ దీపావళికి తెలుగులో నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో చివరి చిత్రంగా ఈ నెల 18న ‘కె-ర్యాంప్’(K Ramp ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ చిత్రం తొలి రోజే పాజిటివ్ టాక్ని సంపాదించుకుంది. దీంతో ఈ మూవీ కలెక్షన్స్ భారీగా పెరిగాయి. ఈ సినిమా రిలీజైన 3 రోజుల్లోనే 17.5 కోట్ల రూపాయల వసూళ్లను అందుకుని బ్రేక్ ఈవెన్ సాధించినట్లు మెకర్స్ తెలిపారు. రిలీజైన 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అందుకోవడం ఈ సినిమా సక్సెస్ ను ప్రూవ్ చేస్తోంది.
‘మా చిత్రానికి పాజిటివ్ మౌత్ టాక్ తో రోజు రోజుకూ కలెక్షన్స్ పెరుగుతున్నాయి. సిటీస్ తో పాటు బీ, సీ సెంటర్స్ లోనూ థియేటర్స్ హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. యూత్ తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులు "K-ర్యాంప్" సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు’ మేకర్స్ తెలిపారు.
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మించారు. జైన్స్ నాని దర్శకత్వం వహించారు. యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది.
Prekshaka Devullaki 🙏❤️#KRamp #DiwaliKAblockbuster pic.twitter.com/9b5Ednjm4J
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) October 21, 2025