
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఆ ఇద్దరి పేర్లే తెగ వైరలవుతున్నాయి. ఆ జంట మరెవరో కాదు.. నేషనల్ క్రష్ రష్మిక.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఇటీవలే వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు వార్తలొస్తున్నాయి. కానీ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటనైతే రాలేదు. వీరిద్దరిపై ఎప్పటి నుంచో డేటింగ్ రూమర్స్ వస్తున్నప్పటికీ ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వలేదు. తాజాగా నిశ్చితార్థం విషయంలోనూ అదే జరిగింది. ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.
ఇక ఈ సంగతి పక్కన పెడితే రష్మిక నటించిన రెండు సినిమాలు రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. అందులో ఒకటి థామా.. మరొకటి ది గర్ల్‌ఫ్రెండ్. ఈ నేపథ్యంలో రష్మిక చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. లేటేస్ట్‌గా రిలీజైన థామా సాంగ్ గురించి రష్మిక పోస్ట్ పెట్టారు. ఆ సాంగ్ రూపొందించడం వెనక ఉన్న స్టోరీని వివరిస్తూ పోస్ట్ పెట్టారు. ఇదంతా దర్శకనిర్మాతలు అనుకోకుండా తీసుకున్న నిర్ణయమని తెలిపారు.
ఆయుష్మాన్ ఖురానా హీరోగా వస్తోన్న థామా నుంచి ఇటీవల నువ్వు నా సొంతమా అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటలో రష్మిక తన అందంతో డ్యాన్స్‌తో అభిమానులను అలరించింది. తాజాగా ఈ పాట వెనక ఉన్న ఓ ఆసక్తికర విషయాన్ని ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.
రష్మిక తన పోస్ట్‌లో రాస్తూ.. 'మేము ఓ అందమైన ప్రదేశంలో దాదాపు 12 రోజుల పాటు షూటింగ్ చేశాం. అయితే షూట్ చివరి రోజు మా దర్శకనిర్మాతలకు ఓ ఆలోచన వచ్చింది. ఈ ప్లేస్ ఇంత బాగుంది కదా మనం ఇక్కడ పాట ఎందుకు చేయకూడదని అన్నారు. ఆ ఆలోచన మా అందరికీ నచ్చింది. ఆ లొకేషన్ అందంగా ఉండడంతో మూడు, నాలుగు రోజుల్లోనే పాటను పూర్తి చేశాం. మేము ప్లాన్ చేసిన వాటికంటే ఇది చాలా బాగా వచ్చింది. ఈ పాటలో భాగమైన వారందరికీ అభినందనలు. మీరంతా కూడా థియేటర్‌లో ఈ సాంగ్‌ను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా' అంటూ సాంగ్ స్టిల్స్‌ను షేర్ చేశారు. కాగా.. ఈ హారర్ మిస్టరీ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రానికి ముంజ్య ఫేమ్ ఆదిత్య సర్పోత్థార్ దర్శకత్వం వహించారు.