
సినీ తారల ప్రేమ, పెళ్లిపై రోజూ రకరకాల రూమర్స్ వస్తుంటాయి. రిలేషన్స్‌లో ఉన్నారని.. పెళ్లి జరిగిందని..ఇలాంటి పుకార్లు దాదాపు అందరిపై వస్తుంటాయి. వాటిలో కొన్ని నిజం అయితే చాలా వరకు అబద్దాలుగానే మిగిలిపోతాయి. తాజాగా టాలీవుడ్‌కి చెందిన ఓ హీరోయిన్‌పై కూడా అలాంటి ‘రిలేషన్’ రూమర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. యండ్ డైరెక్టర్‌తో ఆమె ప్రేమలో ఉందని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వారిద్దరు కలిసి దీపావళి పండగను జరుపుకోవడంలో మరోసారి వీరిద్దరి రిలేషన్‌పై నెట్టింట చర్చ మొదలైంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో చెప్పలేదు కదా.. తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ(Eesha Rebba). ప్రేమలో పడింది.. యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్( Tharun Bhascker ).
2012లొ లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది తెలుగమ్మాయి ఈషా రెబ్బ. తొలి చిత్రంతోనే నటన పరంగా మంచి మార్కులే సంపాదించుకుంది. ఆ తర్వాత చిన్న చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. కానీ అనుకున్న స్థాయిలో గుర్తింపుని తీసుకురాలేకపోయాయి. దీంతో అరవింద సమేత వీర రాఘవ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాల్లో కీలక పాత్రలో నటించి మెప్పించింది. చాలా సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా చేసింది. అలాగే పలు వెబ్ సిరీస్‌లోనూ నటించింది. త్రీ రోజెస్ సినిమాలో కొంచం బోల్డ్ పాత్రలో నటించినా.. ఈ బ్యూటీకి అనుకున్నంత గుర్తింపు అయితే రాలేదు.
తరుణ్‌తో ప్రేమలో..
యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌తో ఈషా ప్రేమలో ఉన్నారనే పుకారు గత కొంతకాలంగా టాలీవుడ్‌లో వినిపిస్తూనే ఉంది. గతంలో వీరిద్దరు కలిసి తిరుమలకు వెళ్లారు. అప్పుడు వీరిద్దరి ఫోటోలో బాగా వైరల్ అయ్యాయి. తాజాగా ఇద్దరు కలిసి దీపావళి పండుగను సెలెబ్రేట్ చేసుకున్నారు. యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో జరిగిన దీపావళి వేడుకకి తరుణ్, ఈషా కలిసి వెళ్లారు. విశ్వక్ ఫ్యామిలీతో కలిసి టపాసులు కాలుస్తూ సందడి చేశారు.
వీళ్లిద్దరూ క్లోజ్ గా కనిపించిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే తరుణ్, ఈషా రెబ్బ మధ్య రిలేషన్ ఉన్నారనే విషయంపై మరోసారి నెట్టింట చర్చ జరుగుతోంది. ప్రేమలో ఉన్నారని..త్వరలోనే పెళ్లి చేసుకుంటారని కొంతమంది అంటుంటే.. అదేం లేదు.. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఈషా రెబ్బ త్వరలో కొత్త సినిమా చేయబోతున్నారని, అందుకే అతనితో వెళ్ళినట్లు మరికొంత మంది అంటున్నారు. వారిద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తే కానీ వాస్తవం ఏది అనేది తెలియదు.