
ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్లలో టాప్‌లో దూసుకుపోతున్న రష్మిక.. వరస సినిమాలతో బిజీగా ఉంది. ఈమె హిందీలో చేసిన లేటెస్ట్ మూవీ 'థామా'. 'స్త్రీ' యూనివర్స్‌లో భాగంగా వస్తున్న నాలుగో మూవీ ఇది. ఇంతకుముందు భేడియా, స్త్రీ, ముంజ్య చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకుల్ని అలరించాయి. ఇప్పుడు 'థామా' పేరుతో ఈ మూవీలో రష్మిక, ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించారు. తాజాగా టీజర్‌ని 'వరల్డ్ ఆఫ్ థామా' పేరుతో రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లోకి అనసూయ.. ఇదిగో క్లారిటీ)
గతంలో రష్మిక చెప్పినట్లు అతీంద్రియ శక్తులతో కూడిన రొమాంటిక్ సినిమాగా 'థామా' తీశారు. టీజర్‌లో రష్మిక.. ఇదివరకు ఎన్నడూ చూడనటువంటి పాత్రలో కనిపించింది. బోల్డ్‌గా కనిపిస్తూనే భయపెట్టింది కూడా. ఇందులో రష్మిక, దెయ్యంగానూ యాక్ట్ చేసినట్లు అనిపిస్తుంది. ఈ సినిమాకు ఆదిత్య సర్పోట్దర్ దర్శకుడు. హారర్ స్టోరీ అయినప్పటికీ.. ప్రేమకథని కూడా చూపించబోతున్నారు. ఈ దీపావళికి మూవీ థియేటర్లలోకి రానుంది.
(ఇదీ చదవండి: తండ్రి కాబోతున్న తెలుగు యంగ్ హీరో.. భార్యకు సీమంతం)