
బిగ్‌బాస్ 9 తెలుగు సీజన్ సందడి ఇప్పటికే షోషల్‌మీడియాలో మొదలైంది. ఇప్పటికే పలు కొత్త పేజీలు పుట్టుకొచ్చాయి. షో గురించి వీడియోలు షేర్ చేస్తున్నారు కూడా.. షోలో పాల్గొనబోతున్న కొందరి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. సెప్టెంబర్ 7న ప్రారంభం కానున్న బిగ్‌బాస్‌లోకి స్టార్ యాంకర్, నటి అనసూయ వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ క్రమంలో ఈ అంశం గురించి ఆమె వివరణ ఇచ్చారు.
బిగ్‌బాస్‌లోకి అనసూయ అంటూ వారం రోజులుగా రూమర్స్ వస్తున్నాయి. ఈ ప్రచారంపై స్వయంగా అనసూయ స్పందించారు. బిగ్‌బాస్ హౌస్‌లోకి తాను వెళ్లడం లేదంటూ క్లారిటీ ఇచ్చేశారు. అందుకు కారణాలు కూడా ఆమె చెప్పారు. గతంలో తాను ఒకట్రెండు సార్లు దెబ్బలు పడతాయి రాజా అన్నందుకే ఫుల్ వైరల్ అయిపోయింది. ఇక అందులో ఎంట్రీ ఇస్తే అంతే సంగతులు అంటూనే నో చెప్పేశారు. కుటుంబాన్ని వదిలేసి అన్నిరోజుల పాటు తాను ఉండలేనని ఆమె తెలిపారు.
బిగ్‌బాస్: సీజన్9 గత సీజన్లకు భిన్నంగా ఈసారి ఉండబోతుంది. ఎక్కువగా సామాన్యులకు ప్రాధాన్యం ఇస్తుండటంతో నెటిజన్లు ఈ షో పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్స్‌కు ‘అగ్నిపరీక్ష’ పేరుతో ఆడిషన్స్ నిర్వహించారు. ఈ ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ ఆడిషన్స్‌లో న్యాయ నిర్ణేతలుగా నవదీప్, బిందు మాధవి, అభిజీత్ ఉన్నారు. ఆగస్టు 22వ తేదీ నుంచి ఈ పోటీలకు సంబంధించిన ఎపిసోడ్స్ స్టార్‌మా ప్రసారం చేయనుంది.