
తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ ప్రస్తుతం సినిమాలేవీ చేయట్లేదు. ఈ ఏడాది విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ తర్వాత సినిమాలకు కాస్తా విరామం ప్రకటించారు. ఈ సమయంలో ఫ్యామిలీతో కలిసి చిల్ అవుతున్నారు. తాజాగా అజిత్ తన భార్య షాలినితో కలిసి ఓ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో దంపతులిద్దరూ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా తన భార్యకు నుదుట తిలకం దిద్దారు. ఆమె కూడా అజిత్ కాళ్లకు నమస్కరించి భర్త ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ఈ వీడియోను అజిత్ భార్య తన షాలిని తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. నా హదయాన్ని కరిగించిందంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు బ్యూటీఫుల్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. అజిత్, షాలిని 1999లో అమర్కాలం అనే మూవీ సెట్లో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వీరిద్దరు 2000 సంవత్సరంలో వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత షాలిని సినిమాలకు స్వస్తి పలికింది. ఈ ఏడాది రెండు హిట్ తన ఖాతాలో వేసుకున్న అజిత్.. మరో మూవీని ఇంకా ప్రకటించలేదు. విరామం దొరికితే చాలు కారు రేసింగ్లోనూ దూసుకెళ్తున్నారు మన స్టార్ హీరో.
Made for each other ❤️ The cutest duo ever - Thala Ajith & #Shalini Mam 🥰#AjithKumar #ShaliniAjithKumar pic.twitter.com/QqBfYXQjx9
— AJITH FANS COMMUNITY (@TFC_mass) August 9, 2025