
నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం రాబిన్‌హుడ్. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ రోజే థియేటర్లలోకి వచ్చేసింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే ఈ సినిమా ద్వారా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించారు. ఈ మూవీ రిలీజ్ ముందు ప్రమోషన్లలోనూ బిజీగా పాల్గొన్నారు. రాబిన్‌హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిశారు. దీంతో రాబిన్‌హుడ్‌లో డేవిడ్ రోల్‌పై అభిమానుల్లో మరింత అంచనాలు పెరిగాయి.
అయితే ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ పాత్రపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కెమియో రోల్ అయినప్పటికీ ట్రైలర్ ఎంట్రీ ఇవ్వడం చూసిన ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఉంటుందని ఊహించారు. కానీ అభిమానులు ఊహించినంత స్థాయిలో మాత్రం డేవిడ్ పాత్ర కనిపించలేదు. కేవలం 2 నిమిషాల 50 సెకన్ల పాటు కనిపించి ఉస్సురుమనిపించారు. రాబిన్‌హుడ్‌లో కొద్దిసేపే కనిపించడంపై డేవిడ్ వార్నర్ అభిమానులు నిరాశకు గురయ్యారు. అది కూడా కేవలం డ్రగ్ డీలర్ పాత్రలో కనిపించడం.. కథలో పెద్దగా ప్రాముఖ్యత లేకపోవడంతో మైనస్‌గా మారింది.
మూవీ ప్రమోషన్స్‌లో డైరెక్టర్ వెంకీ కుడుముల వార్నర్ పాత్రపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. వార్నర్ రోల్ ఈ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్తుందని అన్నారు. అంతేకాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరు కావడం, స్వయంగా అతను కూడా మూవీ ప్రమోషన్లలో పాల్గొనడంతో అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. కనీసం పది నిమిషాల పాటైనా వార్నర్ స్క్రీన్‌పై సందడి చేస్తే బాగుండేదని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వార్నర్.. భవిష్యత్తులో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుందాం.