
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘మాస్ జాతర’. ఈ యాక్షన్ థ్రిల్లర్కు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా కనిపించనుది. ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
(ఇది చదవండి: Mass Jathara: ‘ఓలే ఓలే' పాట రిలీజ్.. రవితేజ, శ్రీలీల డ్యాన్స్ అదుర్స్)
కొద్ది రోజుల క్రితమే ఓలే ఓలే అనే మాస్ సాంగ్‌ను విడుదల చేసిన మేకర్స్ మరో బిగ్ అప్డేట్ ఇచ్చారు. మాస్ జాతర టీజర్ను ఈనెల 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సోమవారం ఉదయం 11 గంటల 8 నిమిషాలకు రిలీజ్ చేస్తామని సితార ఎంటర్టైన్మెంట్ ట్వీట్ చేసింది. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాతో అభిమానులకు మరోసారి మాస్ ట్రీట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతమందిస్తున్నారు.
A full meal of MASS 🔥
A full heart of ENTERTAINMENT 🤩
All served together with #MassJatharaTeaser tomorrow at 11:08 AM ❤️🔥#MassJathara #MassJatharaOnAug27th
Mass Maharaaj @RaviTeja_offl @Sreeleela14 @BhanuBogavarapu @vamsi84 #SaiSoujanya #BheemsCeciroleo @vidhu_ayyanna… pic.twitter.com/9QIbjkvgF0— Sithara Entertainments (@SitharaEnts) August 10, 2025