
ఒక్క పాటతో గుర్తింపు తెచ్చుకున్న సినిమా 'జూనియర్'. శ్రీలీల వైరల్ వయ్యారి అని స్టెప్పులు వేసేసరికి ఈ చిత్రం అప్పట్లో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. గాలి జనార్ధన రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా పరిచయమైన ఈ మూవీ.. జూలైలోనే థియేటర్లలోకి వచ్చింది. కానీ ఓటీటీ రిలీజ్ గురించి ఎలాంటి అప్‌డేట్ లేదు. రీసెంట్‌గానే ఆహా లోకి వస్తుందని ప్రకటించారు. ఎప్పుడా అని నెటిజన్లు ఎదురుచూస్తుండగా ఇప్పుడు తేదీని కూడా అనౌన్స్ చేశారు.
(ఇదీ చదవండి: సగం వయసున్న వాళ్లతో డేటింగ్.. నేను కూడా రెడీ: హీరోయిన్ అమీషా పటేల్)
కిరిటీ, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించగా జెనీలియా కీలక పాత్రలో నటించింది. కాలేజీ బ్యాక్ డ్రాప్‌తో తీసిన ఎమోషనల్ మూవీ ఇది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. బాక్సాఫీస్ దగ్గర అంతంత మాత్రంగానే ఆడిన ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. తొలుత ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుందని టాక్ నడిచింది. కానీ ఇప్పుడు తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీలో ఈనెల 22 నుంచి అంటే సోమవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు. మరోవైపు కన్నడ వెర్షన్.. నమ్మ ఫ్లెక్స్ అనే ఓటీటీలో ఇదే రోజునుంచి అందుబాటులోకి రానుందని ప్రకటించారు.
'జూనియర్' విషయానికొస్తే.. ఇంజినీరింగ్ చదివే అభి(కిరీటి) జ్ఞాపకాలే ముఖ్యమనుకుని నమ్ముతాడు. అందుకు తగ్గట్లే కాలేజీలో నాలుగేళ్లు సరదాగా గడిపేస్తాడు. మంచి జ్ఞాపకాల్ని దాచుకుంటాడు. చదువు పూర్తయిన తర్వాత తాను లవ్ చేసిన స్ఫూర్తి (శ్రీలీల) పనిచేసే కంపెనీలోనే ఉద్యోగంలో చేరతాడు. కానీ బాస్ విజయ సౌజన్య (జెనీలియా)కి ఇతడంటే నచ్చదు. అలాంటి అభితో కలిసి అనుకోని పరిస్థితుల్లో విజయనగరం అనే ఊరికి వెళ్లాల్సి వస్తుంది. మరి విజయనగరానికి, విజయకి సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: మౌళి.. రౌడీ టీ షర్ట్, మహేశ్ ట్వీట్.. ఇవన్నీ ఫేక్: బండ్ల గణేశ్)
