
నితిన్ హీరోగా నటించిన రాబిన్ హుడ్(Robinhood).. ఈ ఏడాది మార్చిలో విడుదలై డిజాస్టర్ టాక్ సంపాదించుకుంది. శ్రీలీల గ్లామర్, క్రికెటర్ డేవిడ్ వార్నర్ క్యామియో, కేతికా శర్మ ఐటమ్ సాంగ్..ఏవి సినిమాను రక్షించలేకపోయాయి. ఛలో, భీష్మ లాంటి బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకున్న వెంకీ కుడుముల ఈ చిత్రంలో అపజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఓటీటీలో అయినా ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం చిత్రబృందంలో బలంగా ఉంది. అయితే ఓటీటీ కంటే ముందే ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ని కొనుగోలు చేసిన జీ5(ZEE5) సంస్థ.. మే 10న ఈ చిత్రాన్ని టీవీలో టెలికాస్ట్ చేయనుంది. ఆ తర్వాతే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.
‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫార్ములా అప్లై
‘సంక్రాంతి వస్తున్నాం’సినిమాను అటు ఛానల్‌లో, ఇటు ఓటీటీలోకి ఓకేసారి తీసుకోచ్చింది జీ5 సంస్థ. ఇప్పుడు ‘రాబిన్‌హుడ్’ విషయంలోనూ అదే ఫాలో అవుతోంది. ఓటీటీ రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు కానీ.. మే 10వ తేదినే ఓటీటీలో కూడా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని ఒకేసారి టీవీలోనూ, ఓటీటీలో రిలీజ్ చేయడం వల్ల.. జీ చానల్‌కి మంచి టీఆర్పీ వచ్చింది. అందుకే రాబిన్ హుడ్ చిత్రానికి కూడా అదే ఫార్ములా అప్లై చేస్తున్నారు. మరి ఈ రాబిన్‌హుడ్ కనీసం బుల్లితెర మనసులను అయినా దోచుకుంటాడో లేదో చూడాలి.
రాబిన్ హుడ్ కథేంటంటే..?
రామ్ (నితిన్) అనాథ. చిన్నప్పుడు అతన్ని ఓ పెద్దాయన హైదరాబాద్‌లోని ఓ అనాథ ఆశ్రమంలో చేర్పిస్తాడు. అక్కడ తినడానికి తిండిలేక ఇబ్బందిపడుతున్న తోటి పిల్లల కోసం దొంగగా మారతాడు. పెద్దయ్యాక ‘రాబిన్‌హుడ్’ పేరుతో ధనవంతుల ఇళ్లలో చోరీలు చేస్తుంటాడు. అతన్ని పట్టుకోవడం కోసం రంగంలోకి దిగిన పోలీసు అధికారి విక్టర్(షైన్ చాం టాకో) ఈగోని దెబ్బతీస్తూ ప్రతిసారి దొరికినట్లే దొరికి తప్పించుకుంటాడు. దీంతో విక్టర్ రాబిన్‌ని పట్టుకోవడమే టార్గెట్‌గా పెట్టుకుంటాడు. రాబిన్‌కి ఈ విషయం తెలిసి..దొంగతనం మానేసి జనార్ధన్ సున్నిపెంట అలియాస్ జాన్ స్నో(రాజేంద్రప్రసాద్) నడిపే ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అవుతాడు.
అదే సమయంలో ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఇండియన్ ఫార్మా కంపెనీ అధినేత కుమార్తె నీరా వాసుదేవ్ (శ్రీలీల) ఇండియాకు వస్తుంది. ఆమెకు సెక్యూరిటీగా రాబిన్ వెళ్తాడు. ఇండియాకు వచ్చిన నీరాను గంజాయి దందా చేసే రౌడీ సామి(దేవదత్తా నాగే) మనుషులు బంధించి రుద్రకొండ అనే ప్రాంతానికి తీసుకెళ్తారు? సామి వలలో చిక్కుకున్న నీరాను రాబిన్‌హుడ్ ఎలా రక్షించాడు? నిరాను రుద్రకొండకు ఎందుకు రప్పించారు? రాబిన్‌హుడ్ సడెన్‌గా సెక్యూరిటీ ఏజెన్సీలో ఎందుకు చేరాల్సివచ్చింది? ఈ కథలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Full of laughs, packed with thrills, and loaded with chills – Robinhood ! Don't miss 🌟🎬
Robinhood World Television Premiere On May 10th, Saturday at 6 PM On #ZeeTelugu#ZeeTeluguPromo #WorldTelevisionPremiereRobinhood #RobinhoodOnZeeTelugu pic.twitter.com/SjA5ShGdPX— ZEE TELUGU (@ZeeTVTelugu) May 6, 2025