అనుష్కా శెట్టి కెరీర్‌లోని బ్లాక్‌బస్టర్ మూవీ ‘అరుంధతి’. కోడి రామకృష్ణ దర్శకత్వంలో శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం 2009లో విడుదలైంది. ఈ చిత్రంలో అనుష్క చేసిన రెండు పాత్రల్లో ‘జేజెమ్మ’గా ఆమె నటన అందర్నీ ఆకట్టుకుంది. ఇప్పుడు హిందీ జేజెమ్మగా శ్రీలీల కనిపించనున్నారని టాక్. ‘అరుంధతి’ చిత్రం హిందీలో రీమేక్ కానున్నట్లుగా ఎప్పట్నుంచో వార్తలు వçస్తున్నాయి.
ఇప్పుడు ఈ పనులు ఊపందుకున్నాయని, ‘అరుంధతి’ హిందీ రీమేక్‌ను నిర్మించాలని అల్లు అరవింద్ సన్నాహాలు మొదలుపెట్టారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అంతేకాదు... ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తారని, తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారనే ప్రచారం సాగుతోంది. మరి... హిందీ తెరపై ‘అరుంధతి’గా శ్రీలీల కనిపిస్తారా? 16 సంవత్సరాల తర్వాత ‘అరుంధతి’ సినిమా హిందీలో రీమేక్ అవుతుందా? అనే విషయాలపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.


