
శ్రీలీల ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీలో సినిమాలు చేస్తోంది. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి ఈమెపై రూమర్స్ వస్తున్నాయి. బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్‌తో ఈమె డేటింగ్‌లో ఉందని అంటున్నారు. అందుకు తగ్గట్లు పలుమార్లు కలిసి కనిపించడం పుకార్లకు ఊతమిస్తోంది. తాజాగా వీళ్లిద్దరూ కలిసి వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవడం కొత్త సందేహాలు రేకెత్తిస్తోంది. ఇంతకీ ఏంటి విషయం?
శ్రీలీల ఇప్పటివరకు పలువురు హీరోలతో కలిసి పనిచేసింది. కానీ కార్తిక్ ఆర్యన్‌తో కాస్త చనువుగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే కొన్నిరోజుల క్రితం సోదరి డాక్టర్ పట్టా అందుకున్న సందర్భంగా కార్తిక్ ఆర్యన్ ఇంట్లో చిన్న పార్టీ చేసుకున్నారు. ఇందులో కార్తిక్ ఫ్యామిలీతో పాటు శ్రీలీల కనిపించారు. అలానే కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కార్తిక్ తల్లి.. తమకు డాక్టర్ చదువుకొన్న కోడలు రావాలనుకుంటున్నానని చెప్పింది. శ్రీలీల డాక్టర్ కోర్స్ పూర్తి చేసింది. కార్తిక్ తల్లి ఈమె గురించి మాట్లాడిందా అనేది క్వశ్చన్ మార్క్.
(ఇదీ చదవండి: 'లిటిల్ హార్ట్స్'.. ఇది ఒరిజినల్ సాంగ్)
ఇకపోతే ఇప్పుడు ముంబైలోని కార్తిక్ ఆర్యన్ ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ జరగ్గా.. శ్రీలీలతో పాటు ఆమె తల్లి కూడా హాజరైంది. అయితే ఇది పార్టీ గెదరింగ్ లేదంటే తమ రిలేషన్‍ని కార్తిక్-శ్రీలీల పరోక్షంగా బయటపెడుతున్నారా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం వీళ్లిద్దరూ అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇది రొమాంటిక్ లవ్ స్టోరీతో తీస్తున్నారు. వచ్చే ఏడాది ఇది రిలీజ్ కానుంది. మరి కార్తిక్ ఆర్యన్-శ్రీలీలది ఫ్యామిలీ బాండింగా లేదంటే డేటింగ్ అనేది తెలియాలంటే వీళ్లలో ఎవరో ఒకరు నోరు విప్పాలి.
(ఇదీ చదవండి: మల్లెపూలు ఎంత పనిచేశాయ్.. నటికి రూ.1.14 లక్షల జరిమానా)