కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్(Sivakarthikeyan) , శ్రీలీల(Sreeleela) హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం పరాశక్తి. ఈ మూవీకి సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాను డాన్ పిక్చర్స్ సంస్థ అధినేత ఆకాశ్ భాస్కర్ నిర్మిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. సింగారాల సీతాకోకవే అంటూ రొమాంటిక్ లవ్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు భాస్కర భట్ల లిరిక్స్ అందించగా.. ఎల్వీ రేవంత్, ఢీ, సీ రోల్డాన్ ఆలపించారు. ఈ పాటను జీవీ ప్రకాశ్ కుమార్ కంపోజ్ చేశారు. ఈ సాంగ్ మ్యూజికల్ లవర్స్‌ను తెగ అలరిస్తోంది. ఇందులో రవిమోహన్, అధర్వ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను పొంగల్ కానుకగా జనవరి 14న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.


