
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఈ ఏడాది నితిన్ సరసన రాబిన్‌హుడ్‌లో మెప్పించిన భామ.. ప్రస్తుతం మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం జూనియర్. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో జెనీలియా కీలక పాత్ర పోషించారు.
ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. ఇప్పటికే విడుదలైన సాంగ్, టీజర్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే మరో లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేయనున్నారు. ఈనెల 4న వైరల్ వయ్యారి అంటూ సాగే పాటను రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలీల, దేవీశ్రీ ప్రసాద్ చేసిన ప్రమోషన్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియో మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్పీకి కాల్ చేసిన శ్రీలీల.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన మీ రీల్సే కనిపిస్తున్నాయి.. మీలా వైరల్ ఎలా అవ్వాలో నేర్పిస్తారా అని అడిగింది. ఏంటీ వైరల్ ఎలా అవ్వాలో మీకు నేర్పాలా?కామెడీ వద్దమ్మా? మీరే నాకు నేర్పాలని దేవీశ్రీ అన్నారు. నిజమే కదా.. మీరు వయ్యారంగా ఓ మాస్ స్టెప్ వేస్తే అదే వైరలైపోద్ది అని చెప్పాడు. అదేదో మీరే ఇవ్వండి సార్ అని శ్రీలీల ముద్దుగా అడగడంతో.. వైరల్ వయ్యారి అంటే ఎలా ఉంది సాంగ్ అంటూ దేవీశ్రీ మ్యూజిక్ అదరగొట్టేశాడు. ఇదంతా వైరల్ వయ్యారి పాట కోసమే వీరిలా వైరైటీ ప్రమోషన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
కాగా.. వారాహి చిత్రం బ్యానర్‌పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో జూన్ 18న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు టాలీవుడ్ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.
#Junior second single #ViralVayyari out on July 4th
In cinemas July 18th. @sreeleela14 @ThisIsDSP pic.twitter.com/TDAbv8w5Rz— ScreenTimeGuru (@ScreenTimeGuru) July 1, 2025