నాని 'ది ప్యారడైజ్‌' టైటిల్‌ సాంగ్‌ ప్రోమో | The Paradise Aaya Sher Song Promo out now | Sakshi
Sakshi News home page

నాని 'ది ప్యారడైజ్‌' టైటిల్‌ సాంగ్‌ ప్రోమో

Feb 23 2026 11:41 AM | Updated on Feb 23 2026 11:52 AM

The Paradise Aaya Sher Song Promo out now

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్‌’ నుంచి టైటిల్‌ సాంగ్‌ ప్రోమో వచ్చేసింది. ఆయా షేర్‌... అంటూ వందలాదిమంది డ్యాన్సర్లతో నాని వేసిన స్టెప్పులకు అదిరిపోయేలా అనిరుధ్ రవిచందర్ సంగీతం ఉంది. కాసర్ల శ్యామ్ కుమార్ రచించిన ఈ పాటను అడ్డుల జంగిరెడ్డి, ఆకునూరి దేవయ్య, అనిరుధ్ రవిచందర్ ఆలపించారు. ఫిబ్రవరి 24న పూర్తి సాంగ్‌ను విడుదల చేస్తామని ప్రోమోలో ప్రకటించారు. 

దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మోహన్‌బాబు, సంపూర్ణేశ్‌బాబు, రాఘవ్‌ జుయల్, సోనాలి కులకర్ణి నటిస్తున్నారు. భారతీయ భాషలతోపాటు ఇంగ్లిష్‌, స్పానిష్‌లో ఆగష్టు 21న  ఈ మూవీ విడుదల కానుంది.  పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాతో రూపొందుతున్న ఈ చిత్రంలో నాని ఒక ప్రేత్యకమైన గెటప్‌లో కనిపించనున్నారు. మొదటి సాంగ్‌ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్రవర్గాలు ఇప్పటికే తెలిపాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement