ఉమెన్‌ కార్డ్‌ తీసిన తనూజ.. డీమాన్‌ పవన్‌ తప్పు చేశాడా? | Thanuja And Demon Pawan Bigg Fight In Bigg Boss 9 Telugu BB Rajyam Task, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 9: ఉమెన్‌ కార్డ్‌ తీసిన తనూజ.. డీమాన్‌ పవన్‌ తప్పు చేశాడా?

Nov 13 2025 9:32 AM | Updated on Nov 13 2025 10:04 AM

Thanuja and Demon Pawan Bigg Fight In Bigg Boss 9Telugu

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఎలాంటి కొత్తదనం లేదు. రణరంగం అంటూ ఊదరగొట్టారు. కానీ, కంటెస్టెంట్స్‌ పేలవమైన ఆటతీరుతో ప్రేక్షకులకు విసుగుతెప్పిస్తున్నారు. ఇప్పటికే 66 రోజులు పూర్తి అయింది. బుధవారం ఎపిసోడ్‌లో కాస్త నవ్వులతో పాటు నామామాత్రపు టాస్క్‌లు పెట్టి ముగించేశాడు. బీబీ రాజ్యం అంటూ జరుగుతున్న టాస్క్‌ పెద్దగా ఆకట్టుకోలేదు. మహారాణులుగా దివ్య-రీతూల కాంట్రవర్సీతో పాటు వారిద్దరూ కలిసి పదేపదే  సుమన్ శెట్టి, భరణి, ఇమ్మానుయేల్‌ని టార్గెట్‌ చేసి ఆటాడుకున్నారనిపిస్తుంది. కమాండర్లుగా ఉన్న డీమాన్‌ పవన్‌-తనూజ మధ్య జరిగిన గొడవ మాత్రమే  వివాదంగా మారింది.

బిగ్‌బాస్ సీజన్-9 ప్రారంభం నుంచే తనూజ కాస్త హైలెట్‌ అవుతూ వస్తుంది. బుధవావరం ఎపిసోడ్‌లో డీమాన్ పవన్‌- తనూజ మధ్య జరిగిన గొడవ కూడా కంటెంట్‌ క్రియేట్‌ కోసం చేసినట్లు అనిపిస్తుంది. డిమాన్‌ పవన్‌ తప్పు అయితే ఎంతమాత్రం లేదు, కానీ అంత చిన్న విషయానికి తనూజ ఎందుకు రచ్చ చేసిందనేది ప్రేక్షకులకు కూడా అర్థం కాలేదు. కేవలం కంటెంట్ కోసమే ఆమె ఇలా చేసిందా అనే అనుమానం వస్తుంది. ఎందుకంటే వెంటనే వారిద్దరూ మళ్లీ కలిసిపోయారు.  మహారాజు-మహారాణుల పాత్రలో ఉన్న కళ్యాణ్, దివ్య, రీతూ కలిసి తనూజను ఆటపట్టించాలనుకుంటారు. ఈ క్రమంలో కిచెన్ దగ్గరికొచ్చి కమాండర్ తనూజని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టమని డీమాన్-నిఖిల్‌లకి చెప్పారు.

దీంతో తనూజని ముందుగు నడవాలంటూ ఆమె భుజం మీద డీమాన్‌ పవన్‌ టచ్ చేశాడు. ఈ సమయంలో తనూజ ఫైర్‌ అయింది.  చెయ్యి వేస్తున్నావేంట్రా.. అంటూ నో ఉమెన్ హ్యాండ్‌లింగ్.. అని ఫైర్‌ అయింది. ఇది రాణి ఆర్డర్ అని నిఖిల్ చెప్తాడు. అయితే, ఇలా హ్యాండిల్ చేస్తారేంటని తనూజ మళ్లీ అడుగుతుంది.  అబ్బాయిల దగ్గర ప్రవర్థిస్తున్నట్లు చేస్తున్నారని తనూజ అంటుంది. కాదు కమాండర్స్‌లా చేస్తున్నారని రాణి పాత్రలో ఉన్న దివ్య కౌంటర్‌ ఇస్తుంది. మీ భుజాన్ని మాత్రమే పట్టుకున్నారు కదా అందులో ఏంటి తప్పు అని దివ్య కామెంట్‌ చేసింది.  అయితే, తనూజ బాధ పడిందని డిమాన్‌ పవన్‌ క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నించాడు. కావాలని నెట్టలేదని చెప్తాడు. అయితే, తనను చాలా ఫోర్స్‌గా తోసేశావ్‌ అంటూ తనూజ చెబుతుంది. 

తాను చాలా హర్ట్‌ అయ్యానని. ఒక ఫ్రెండ్‌గా చెప్పవచ్చు కదా అంటుంది. కొంత సమయం పాటు ఇద్దరి మధ్య మాటల యుద్దం నడిచింది. కానీ, ఎపిసోడ్‌ ప్రకారం ఇందులో ఎక్కువగా తప్పు తనూజదే కనిపిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. రీతూను గతంలో తోయడం వల్ల నాగార్జున ఇప్పటికే అతనికి గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చాడు. ఇప్పుడు తనూజ కూడా మరోసారి అదేవిధంగా డీమాన్‌ పవన్‌ను చూపించే ప్రయత్నం చేసినట్లు అనిపిస్తుంది. వాస్తవంగా తనూజతో పాటు ఇతర ఏ కంటెస్టెంట్‌తో కూడా డీమాన్‌ పవన్‌ చెత్తగా ప్రవర్తించలేదు. అందుకే కామనర్‌గా వచ్చినప్పటికీ ఆటలో కొనసాగుతున్నాడు.

ప్రజలకి మరోసారి కమాండర్లు అయ్యేందుకు బిగ్‌బాస్ ఛాన్స్‌ కల్పించాడు.  కమాండర్లు నిఖిల్‌, పవన్‌లతో ప్రజలు గౌరవ్‌, భరణి  పోటీ పడ్డారు.  ఈ రెండు టీమ్స్ మధ్య 'నిలబెట్టు పడగొట్టు' అనే టాస్క్‌ను బిగ్‌బాస్ ఇచ్చాడు. అయితే, ఇందులో డీమాన్-నిఖిల్ బాగా ఆడారు. మరోవైపు గౌరవ్ కూడా పర్వాలేదనిపించాడు. కానీ  భరణి పూర్తిగా ఫెయిల్ కావడంతో ప్రజలు జట్టు ఓడిపోయింది. కేవలం భరణి వల్ల ఈ టాస్క్‌లో ఓడిపోవడంతో గౌరవ్ తట్టుకోలేకపోయాడు. పదేపదే కెమెరా ముందుకు వచ్చి భరణి ఆట వల్ల నష్టం జరిగిందంటూ వాపోయాడు. 
ఫైనల్‌గా నిఖిల్‌- పవన్‌లు కమాండర్స్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. మరో రౌండ్‌లో నిఖిల్‌ సత్తా చాటి రాజుగా ప్రమోషన్ పొందాడు. రాణిగా ఉన్న దివ్యను ఓడించాడు. దీంతో ఆమె  కమాండర్‌గా మిగిలిపోయింది. బుధవారం ఎపిసోడ్‌లో  ఎక్కువగా నవ్వులు పూయించారని చెప్పాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement