బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్ కొన్నిసార్లు దెయ్యాలకొంపలానూ మారిపోతుంటుంది. ఏమాటకామాట.. దెయ్యం అనగానే అందరికీ గుర్తొచ్చేది సోహైల్! భయమనేది మా ఇంటావంటా లేదన్నట్లుగా బిల్డప్ ఇచ్చి చీకటి గదిలోకి వెళ్లాడు. తీరా అక్కడ చిన్న వెలుతురు లేకపోగా వింత శబ్ధాలు, ఫ్లాష్ లైట్లలో దెయ్యం ఆకారాలు చూసి మామూలుగా జడుసుకోలేదు. ఇప్పుడదే టాస్క్ తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్‌లోనూ రిపీట్ అవుతోంది.
ఆడపులి..
ఈ మేరకు ప్రోమో కూడా వదిలారు. తనూజ భయంభయంగానే ఆ గదిలోకి వెళ్లి తనకిచ్చిన టాస్క్ పూర్తి చేసింది. తర్వాత రీతూ వంతు వచ్చింది. లోపల జాగ్రత్త.. అని సంజనా ధైర్యం చెప్తుంటే.. ఆడపులి ఇక్కడ అని బిల్డప్ ఇచ్చింది. తీరా లోపలకు వెళ్లాక ఆ దెయ్యం కాళ్లు పట్టుకోవడమే తక్కువ అన్నట్లుగా మారింది. ఇలా చేస్తే నేను బయటకు పోతా.. అన్న ప్లీజ్.. ప్లీజ్.. అంటూ వేడుకుంటూనే ఉంది. చివర్లో మాత్రం దెయ్యంలా ఓ నవ్వు నవ్వింది. ఆ నవ్వుకు దెయ్యాలే జడుసుకుని పారిపోవడం ఖాయం! ఈ గేమ్‌లో తనూజ గెలిచినట్లు తెలుస్తోంది. ఇక సుమన్, దివ్య ఎవరికీ అనుమానం రాకుండా సీక్రెట్ టాస్కులు పూర్తి చేస్తున్నారు. మరి చివరకు ఎవరు కెప్టెన్సీ కంటెండర్లవుతారో చూడాలి!


