బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి దివ్వెల మాధురి ఎలిమినేషన్ అయిపోయాక సోమవారం ఎపిసోడ్ మొదలైంది. ఈ వారం నామినేషన్ ప్రక్రియ మొత్తం తనూజ చుట్టే నడిచిందని చెప్పవచ్చు. తనూజపై దివ్య,భరణి, ఇమ్మాన్యేయల్, సాయి శ్రీనివాస్‌లు మాటలతో ఎదురుదాడికి దిగారు. సోమవారం జరిగిన ఎపిసోడ్ మొత్తం తనూజ చుట్టే జరిగింది. ఇంటి సభ్యులు ఒకరిని ఒకరు నామినేట్ చేసుకుంటూ మాటల తూటాలు పేల్చుకున్నారు. టెడ్డీ బేర్‌ల టాస్క్ పేరుతో రేసులో చివరగా చేరిన సభ్యులకు నామినేషన్ బాధ్యత ఇచ్చారు. మొదటి రౌండ్‌లో సంజన నామినేట్ అయితే.. తరువాతి రౌండ్‌లో తనూజ, భరణి మధ్య మాటల యుద్ధంతో హౌస్ హీటెక్కింది. అయితే.. తనూజ వల్లనే తాను హౌస్ నుంచి బయటకు వెళ్లానని, ఆమె ఒక్కసారి కూడా తనను సేవ్ చేయలేదని భరణి ఫైర్ అయ్యాడు.

మొదటి రౌండ్‌లోనే అందరికంటే చివరిగా సంజన ఉండటంతో తనకు నామినేషన్ చేసే ఛాన్స్ దక్కింది. అయితే, సంజనకి తన ఫొటో ఉన్న టెడ్డీయే రావడంతో బిగ్‌బాస్ ఆదేశాల మేరకు మరోకరితో స్వాప్ చేయాలని సంచాలక్ దివ్యకు అధికారం ఇస్తాడు. దీంతో రీతూతో స్వాప్ చేసే అవకాశం దివ్య ఇస్తుంది. ఇక్కడ సంజన, రీతూ ఇద్దరూ వాదించుకోవాలి. ఫైనల్గా ఎవరి వాదన బలంగా ఉంటే వారిని సంచాలక్ సేవ్ చేస్తారు. బలహీనంగా ఉన్న వారిని నామినేట్ చేస్తారు. అలా ఇద్దరి వాదనలో రీతూ పాయింట్లు చాలా బలంగా ఉన్నాయని అనిపిస్తుంది. సంజన వేసిన కౌంటర్లకు రీతూ చెప్పిన సమాధానాలు బాగానే ఉన్నాయి. దీంతో సంజనని నామినేట్ చేసి.. రీతూని సేవ్ చేసింది దివ్య.
తనూజ-భరణి బంధం కట్ 
తరువాతి రౌండ్‌లో తనూజ, భరణి మధ్య మాటల యుద్ధం మొదలైంది. భరణి మాట్లాడుతూ.. 'తనూజ వల్ల నేనే హౌస్ నుంచి బయటకు వెళ్లాను. ఆమె ఒక్కసారి కూడా నన్ను సేవ్ చేయలేదు' అని ఫైర్ అయ్యాడు. ఇన్నిరోజులు నాన్న-కూతురు బాండింగ్లో ఉన్న వారిద్దిరూ తమలో ఎవరు హౌస్‌లో ఉండేందుకు ఎక్కువ అర్హులో వాదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకు తనూజ కోసం మూడుసార్లు సపోర్ట్గా టాస్క్లలో నిలబడ్డానని భరణి అంటారు. దీంతో తనూజ కూడా గట్టిగానే వాదించింది. అవన్నీ సపోర్టింగ్ టాస్క్‌లు కాబట్టే నిలబడ్డారని చెప్పుకొచ్చింది. తనూజ బలమైన పాయింట్లతో భరణిని చిక్కుల్లో పడేసింది. ఇప్పటికీ నీ గేమ్ కూడా మరోకరు ఆడుతున్నారంటూ ఫైర్ అయింది. ఇక ఇద్దరి వాదనలు విన్న తర్వాత దివ్య కూడా ఏం చేయలేకపోయింది. తనూజ కౌంటర్స్ బలంగా ఉండటంతో తప్పనిసరిగా భరణిని నామినేట్ చేసింది. టాస్క్ ముగిసిన తర్వాత భరణి కాస్త రియాలిటీలోకి వచ్చినట్లు ఉన్నాడు. తనూజ, దివ్యల దగ్గరికి వెళ్లి ఇక నుంచి మీరిద్దరూ నా గురించి మాట్లాడకండి. మీ ఆట మీరు ఆడుకోండి అంటూ తమ బంధం ఇంతటితో ముగిసిందని స్పష్టంగా చెప్పేశాడు.

పెళ్లి కూతురులా తనూజ.. ఇమ్మాన్యుయేల్ కౌంటర్స్
తర్వాతి నామినేషన్లో కూడా ఇమ్మాన్యుయేల్తో తనూజ పోటీ పడాల్సి వచ్చింది. తన నామినేషన్ తనూజ అంటూ ఇమ్ము ఫైర్ అయ్యాడు. తనూజ సేఫ్ గేమ్ ఆడుతోందని అతను గట్టిగానే ఆరోపించాడు. అయితే, ఇమ్ము ప్రశ్నలకు తనూజ సరైన సమాధానం చెప్పలేకపోయింది. కానీ, ఈసారి కూడా సంచాలకులు తనూజని నామినేట్ చేయలేదు. అయితే, నామినేషన్ చేసే ఛాన్స్ తనూజకి రావడంతో తను కూడా ఇమ్మాన్యుయేల్‌ని నామినేట్ చేసింది. ఇమ్ము చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడని.. సపోర్ట్ చేస్తున్నా అనే పేరుతో ఒక ముసుగు వేసుకుని సేఫ్ ఆడుతున్నాడని తనూజ చెబుతుంది. అయితే, ఇమ్ము కూడా గట్టిగానే తిరిగి కౌంటర్ ఇచ్చాడు. నువ్వు బెడ్డు టాస్కులో చీర కట్టుకొని పెళ్లి కూతురులా కూర్చుంటే మేము సపోర్ట్ చేశామని గుర్తు చేశాడు. అసులు నువ్వు టాప్-5లోకి ఎలా వచ్చావ్ ఆ గేమ్‌లో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని ఇమ్ము అన్నాడు. ఇలా ఇద్దరూ ఒకరినొకరు గట్టిగానే మాటలతో రెచ్చిపోయారు. మరోవైపు రాము, కళ్యాణ్‌ని నామినేట్ చేశాడు. ఫైనల్గా సంచాలక్‌గా ఉన్న డీమాన్.. కళ్యాణ్‌ని నామినేట్ చేసి ఇమ్ముని సేవ్ చేస్తాడు.

దివ్య- తనూజ మాటల యుద్ధం
చివర్లో బిగ్ బాస్ ఒక సరప్రైజ్ ఇస్తాడు. కెప్టెన్ దివ్యకు ప్రత్యేక అధికారం ఇస్తూ.. ఇప్పటివరకు నామినేట్ కానివారిలో ఒకరిని నామినేట్ చేయాలని కోరుతాడు. దాంతో తనూజను నామినేట్ చేస్తున్నట్లు దివ్య చెప్పింది. ఇక్కడ కూడా భరణి పేరుతో డ్రామ నడిచింది. భరణి, తనూజల బాండ్ దివ్య బ్రేక్ చేసింది అని అందరూ అనుకుంటున్నారు. అలాంటి ఆరోపణలు రావడానికి కారణం నువ్వే (తనూజ) అంటూ దివ్య నామినేట్ చేసింది. దానికి తనూజ కూడా బలంగానే కౌంటర్ ఇస్తుంది. నేను ఆయన్ని (భరణి) నామినేట్ చేశానని నువ్వు నన్ను నామినేట్ చేశావ్ అంటూ ఫైర్ అయింది. ఆపై వెంటనే దివ్య కూడా మరో పంచ్ విసురుతుంది. తనూజ ఎప్పుడూ ఏడుస్తూ కూర్చుంటుంది అంటూ ప్రతి టాస్క్‌లో సింపతీ కోసం చూస్తుందని తనూజపై కామెంట్ చేసింది. ఇలా ఇద్దరి మధ్య పెద్ద మాటల యుద్దమే నడిచింది. ఫైనల్గా 9వ వారం నామినేషన్స్లో సంజన, సుమన్ శెట్టి, భరణి, కళ్యాణ్, రాము, సాయి శ్రీనివాస్, తనూజ ఉన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
