ఔట్ చేసిన ఆనందంలో ఓవరాక్షన్‌.. క‌ట్ చేస్తే! భారీ షాకిచ్చిన ఐసీసీ | Jayden Seales Fined By ICC For Fiery Send Off To Pat Cummins In WI Vs AUS 1st Test, Check Out Full Story Inside | Sakshi
Sakshi News home page

AUS vs WI: ఔట్ చేసిన ఆనందంలో ఓవరాక్షన్‌.. క‌ట్ చేస్తే! భారీ షాకిచ్చిన ఐసీసీ

Jun 27 2025 9:27 AM | Updated on Jun 27 2025 10:32 AM

Jayden Seales fined by ICC for fiery send off to Pat Cummins in WI vs AUS 1st Test

వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జేడెన్ సీల్స్‌కు అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌(ఐసీసీ) భారీ షాకిచ్చింది. బార్బోడ‌స్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న తొలి టెస్టులో త‌న చ‌ర్య‌ల‌కు గాను ఐసీసీ జరిమానా విధించింది.  మొద‌టి రోజు ఆట‌లో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్‌ను ఔట్ చేసిన ఆనందంలో సీల్స్ దురుస ప్ర‌వ‌ర్త‌న క‌న‌బ‌రిచాడు.

తొలి ఇన్నింగ్స్‌లో వ‌రుస క్ర‌మంలో వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను ప్యాట్ క‌మ్మిన్స్ ఆదుకునే ప్ర‌య‌త్నం చేశాడు.  కమ్మిన్స్ 18 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 28 పరుగులు చేశాడు. ఈ క్ర‌మంలో క‌మ్మిన్స్‌ను సీల్స్ అద్బుత‌మైన బంతితో బోల్తా కొట్టించాడు. దీంతో సీల్స్ సెల‌బ్రేష‌న్స్ శ్రుతిమించాయి.

ఈ విండీస్ స్పీడ్ స్టార్ క‌మ్మిన్స్ వైపు వేలు చూపిస్తూ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపో అంటూ సీరియ‌స్ అయ్యాడు. ఈ నేప‌థ్యంలో ఫీల్డ్ అంపైర్‌ల ఫిర్యాదు మేర‌కు సీల్స్‌పై ఐసీసీ మ్యాచ్ రిఫ‌రీ చ‌ర్య‌లు దిగారు. ఆర్టికల్ 2.5 ను ఉల్లంఘించినందుకు అత‌డి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోతతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ విధించారు. సీల్స్ సైతం త‌న త‌ప్పిదాన్ని అంగీక‌రించాడు.

"నా బౌలింగ్‌లో క‌మ్మిన్స్ రెండు భారీ షాట్లు కొట్టినందుకు, అతనికి డ్రెస్సింగ్ రూమ్ ఎక్కడ ఉందో చూపించాను. అంతే త‌ప్ప అందులో ఇంకేమి లేదు" అని సీల్స్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో జైడ‌న్ సీల్స్ నిప్పులు చెరుగుతున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు రెండు ఇన్నింగ్స్‌లలో క‌లిపి 6 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

ర‌స‌వ‌త్త‌రంగా బార్బోడ‌స్  టెస్టు
ఇక బార్బోడ‌స్ టెస్టు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ఇరు జ‌ట్ల‌కు విజ‌య‌వ‌కాశాలు స‌మంగా ఉన్నాయి.  రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా త‌మ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది.క్రీజులో ట్రావిస్ హెడ్‌(13), వెబ్‌స్టెర్‌(19) ఉన్నారు. ఆస్ట్రేలియా ప్రస్తుతం 82 పరుగుల ఆధి​క్యంలో కొనసాగుతోంది.  అంత‌కుముందు వెస్టిండీస్  తమ తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగులకే కుప్పకూలింది.
చదవండి: WI vs AUS: ఆసీస్‌కు చుక్కలు చూపిస్తున్న విండీస్‌.. ఓటమి తప్పదా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement