రావల్పిండి వేదికగా శ్రీలంతో జరిగిన తొలి వన్డేలో గెలిచి జోష్ మీదున్న పాకిస్తాన్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ భారీ షాకిచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా పాకిస్తాన్ జట్టుకు ఐసీసీ జరిమానా విధించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక నిర్ణీత సమయంలో తమ కోటా 50 ఓవర్లు పూర్తి చేయలేకపోయింది (నాలుగు ఓవర్లు వెనుకపడింది).
ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో ఇది ఆర్టికల్ 2.22 ఉల్లంఘణ కిందికి వస్తుంది. ఈ క్రమంలో పాక్ జట్టులో ప్రతీ ఆటగాడి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించారు. తమ తప్పును మెన్ ఇన్ గ్రీన్ కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది అంగీకరించాడు. దీంతో అతను తదుపరి విచారణ నుంచి మినహాయింపు పొందాడు.
నేడు రెండో వన్డే..
ఇక పాక్-శ్రీలంక మధ్య రెండో వన్డేను భద్రతా కారణాల దృష్ట్యా రీ షెడ్యూల్ చేశారు. వాస్తవానికి గురువారం (నవంబర్ 13)న జరగాల్సిన రెండో వన్డే శుక్రవారం జరగనుంది. ఇటీవలే ఇస్లామాబాద్‌లో జరిగిన ఆత్మాహుతి దాడితో లంక క్రికెటర్లు భయందోళనకు గురయ్యారు.
దీంతో తొలి వన్డే తర్వాత లంక క్రికెటర్లలో సుమారు 8 మంది ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లిపోతామని జట్టు మేనేజ్‌మెంట్‌ను కోరారు. కానీ శ్రీలంక క్రికెట్ మాత్రం అందుకు అంగీకరించలేదు. వన్డే సిరీస్‌తో పాటు ముక్కోణపు సిరీస్‌నూ ముగించుకున్నాకే స్వదేశానికి రావాలని వారిని ఆదేశించింది. దీంతో లంక ఆటగాళ్లు పాక్‌లోనే ఉండనున్నారు.
చదవండి: సెలక్టర్ల కీలక నిర్ణయం.. కెప్టెన్‌గా వరుణ్ చక్రవర్తి


