దేశవాళీ క్రికెట్ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (Syed Mushtaq Ali Trophy)-2025 కోసం తమ జట్టును తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా భారత స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) ఎంపికయ్యాడు.
ప్రొఫెషనల్ క్రికెట్‌లో వరుణ్ ఓ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనుండడం ఇదే తొలిసారి. ఇంతకుముందు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తమిళనాడు జట్టుకు స్టార్ ఆల్‌రౌండర్ షారుఖ్ ఖాన్ (M Shahrukh Khan) నాయకత్వం వహించాడు. ఇప్పుడు అతడి స్ధానాన్ని సీనియర్ వరుణ్‌తో సెలక్టర్లు భర్తీ చేశారు.
సాయి కిషోర్, నారాయణ్ జగదీశన్ (Narayan Jagadeesan) ఉన్నప్పటికి వరుణ్‌కే జట్టు పగ్గాలను కట్టబెట్టారు. అయితే ఈ టోర్నీలో అతడి డిప్యూటీగా జగదీశన్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. వరుణ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ను సొంతం చేసుకోవడంలో వరుణ్‌ది కీలక పాత్ర.
ఈ సిరీస్‌లో అతడు మూడు మ్యాచ్‌లలో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇప్పటికే వరుణ్ డొమాస్టిక్ క్రికెట్‌లో తమిళనాడు తరపున తనదైన ముద్ర వేసుకున్నాడు ఇక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నవంబర్ 26 ప్రారంభం కానుంది. తమిళనాడు తమ తొలి మ్యాచ్‌లో టోర్నీ ఆరంభం రోజునే రాజస్తాన్‌తో తలపడనుంది. కాగా ఈ టోర్నీకి స్టార్ ఆటగాడు సాయిసుదర్శన్ దూరమయ్యాడు. స్టార్ ఫాస్ట్ బౌలర్ నటరాజన్ మాత్రం అందుబాటులో ఉన్నాడు.
SMAT 2025 కోసం తమిళనాడు స్క్వాడ్
వరుణ్ చక్రవర్తి (కెప్టెన్), నారాయణ్ జగదీశన్ (వైస్ కెప్టెన్), తుషార్ రహేజా , అమిత్ సాథ్విక్, షారుఖ్ ఖాన్, ఆండ్రీ సిద్దార్థ్, ప్రదోష్ రంజన్ పాల్, శివమ్ సింగ్, సాయి కిషోర్, సిద్ధార్థ్, నటరాజన్, గురజప్నీత్ సింగ్, సోథు సిలంబరసన్, రితిక్ ఈశ్వరన్ (వికెట్ కీపర్)
చదవండి: IPL 2026: ముంబై ఇండియన్స్‌లోకి విధ్వంసకర వీరుడు.. ఆరేళ్ల తర్వాత


