
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్‌లో విషాదం నెలకొంది. ఆ దేశ అంతర్జాతీయ అంపైర్ బిస్మిల్లా జన్ షిన్వారీ 41 ఏళ్ల యుక్త వయసులోనే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రమైన అనారోగ్యం కారణంగా షిన్వారీ మరణించినట్లు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఇవాళ (జులై 8) ప్రకటించింది. ఏసీబీ షిన్వారీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసింది. ఆఫ్ఘన్ క్రికెట్ గొప్ప సేవకుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేస్తూ.. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది.
ACB's Condolence and Sympathy Message
ACB’s leadership, staff, and entire AfghanAtalan family are deeply shocked and saddened by the demise of Bismillah Jan Shinwari (1984 - 2025), a respected member of Afghanistan’s elite umpiring panel.
It is with deep sorrow that we share… pic.twitter.com/BiZrTOLe6m— Afghanistan Cricket Board (@ACBofficials) July 7, 2025
1984 మార్చిలో జన్మించిన షిన్వారీ 2017 డిసెంబర్‌లో అంతర్జాతీయ అంపైరింగ్ అరంగేట్రం చేశాడు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ లీగ్ 2 మ్యాచ్‌లో అతను చివరి సారి అంపైరింగ్ చేశాడు. షిన్వారీ తన కెరీర్‌లో 60 అంతర్జాతీయ మ్యాచ్‌లకు (34 వన్డేలు, 26 టీ20లు) అంపైర్‌గా వ్యవహరించాడు. షిన్వారీ తన అంపైరింగ్ జర్నీని ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ వన్డే మ్యాచ్‌తో ప్రారంభించాడు.
బాంబు పేలుళ్ల నుంచి బయటపడి..!
షిన్వారీ 2020 అక్టోబర్‌లో నగర్హర్ ఫ్రావిన్స్‌లో జరిగిన బాంబు పేలుళ్లను బయటపడ్డాడు. ప్రాథమిక నివేదికల్లో షిన్వారీ మరియు అతని కుటుంబ సభ్యులు చాలా మంది మృతి చెందారని వార్తలు వచ్చాయి. అయితే అతనే స్వయంగా మీడియా ముందుకు వచ్చి చనిపోలేదని నిర్ధారించాడు.