
ఐసీసీ ఇవాళ (ఆగస్ట్ 20) ప్రకటించిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఘోర తప్పిదం జరిగింది. గత వారం ర్యాంకింగ్స్‌లో రెండు, నాలుగు స్థానాల్లో ఉండిన టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి.. తాజా ర్యాంకింగ్స్‌లో టాప్-100లో కూడా కనబడలేదు. ఈ ఇద్దరి పేర్లు ఆకస్మికంగా మాయం కావడంపై సోషల్‌మీడియాలో భారీ ఎత్తున డిస్కషన్స్ నడుస్తుండగా ఐసీసీ స్పందించింది.
సాంకేతిక లోపం కారణంగా రోహిత్, కోహ్లి పేర్లు ర్యాంకింగ్స్‌లో కనబడలేదని వివరణ ఇచ్చింది. తప్పును సరి దిద్దుకుంటూ వారిద్దరి పేర్లను తిరిగి ర్యాంకింగ్స్ జాబితాలో చేర్చింది. అప్‌డేట్ చేసిన తర్వాత రోహిత్, కోహ్లి తమ పాత ర్యాంకులైన రెండు, నాలుగు స్థానాలను తిరిగి దక్కించుకున్నారు.
రోహిత్, కోహ్లి వన్డే ర్యాంకింగ్స్‌లోకి రీఎంట్రీ ఇవ్వడంతో వారి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తొలుత ర్యాంకింగ్స్‌లో కనపడకపోయే సరికి రోహిత్, కోహ్లి వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించారని ప్రచారం జరిగింది. అయితే సాంకేతిక లోపం కారణంగా తప్పిదం జరిగిందని తెలిసి రోహిత్, కోహ్లి అభిమానుల మనసులు కుదుటపడ్డాయి.
కాగా, సాంకేతిక లోపం కారణంగా తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో మరిన్ని తప్పిదాలు దొర్లాయి. రోహిత్, కోహ్లి పేర్లు మాయమైపోవడంతో పాటు పలువురు రిటైరైన ఆటగాళ్ల పేర్లు జాబితాలో ప్రత్యక్షమయ్యాయి. ఇందులో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్, స్టీవ్ టికోలో, అలెక్స్ ఓబండ, థామస్ ఒడోయో, అన్షీ రథ్ లాంటి పేర్లు ఉన్నాయి. తప్పిదాన్ని గుర్తించిన తర్వాత ఐసీసీ వీరి పేర్లను తొలగించింది.
సవరించిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాడు శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ, బాబర్ ఆజమ్, విరాట్ కోహ్లి, డారిల్ మిచెల్, చరిత్ అసలంక, హ్యారీ టెక్టార్, శ్రేయస్ అయ్యర్, ఇబ్రహీం జద్రాన్, కుసాల్ మెండిస్ టాప్-10లో ఉన్నారు.