అంతర్జాతీయ క్రికెట్‌లో యూఎస్‌ఏ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆఫ్‌స్పిన్నర్ బొడుగం అఖిలేష్ రెడ్డి అబుదాబి టి10 లీగ్‌లో ఆడుతూ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అవినీతి నిరోధక నిబంధనలను అతను ఉల్లంఘించినట్లు వెల్లడైంది.
25 ఏళ్ల అఖిలేష్ రెడ్డిపై మూడు వేర్వేరు అభియోగాలు నమోదు చేసిన ఐసీసీ... అతడిపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇచ్చేందుకు అఖిలేష్‌కు 14 రోజుల గడువు ఇచ్చింది. విచారణ ముగిసిన అనంతరం అతనిపై పూర్తి స్థాయిలో చర్యలుంటాయి.
అబుదాబి టి10 లీగ్‌లో అస్పిన్ స్టాలియన్స్ జట్టు తరఫున బుధ, గురువారాల్లో అతను 2 మ్యాచ్‌లు ఆడాడు. హైదరాబాద్‌కు చెందిన 25 ఏళ్ల అఖిలేష్ రెడ్డి ఈ ఏడాది ఆరంభంలో నార్త్ అమెరికా టి20 కప్‌లో యూఎస్ తరఫున అరంగేట్రం చేసి 4 మ్యాచ్‌లు ఆడాడు.
చదవండి: అతడిని చూసి భయపడ్డా.. గెలిచే మ్యాచ్‌లో ఓడిపోయాము: స్టోక్స్


