
ఆసియా కప్‌లో భాగంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అనంతరం ‘నో-షేక్ హ్యాండ్’ వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యుడిగా మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేయడంతో ఈ వివాదం మరింత రాజుకుంది.
పాకిస్తాన్ జట్టు సభ్యులతో కరచాలనం చేయకూడదనే తమ నిర్ణయానికి భారత్ టాస్ నుంచి ఆట ముగిసే వరకు కట్టుబడి ఉంది. టాస్ సందర్భంగా ఆండీ పైక్రాప్ట్.. భారత సారధి సూర్యకుమార్ దగ్గరికి షేక్ హ్యాండ్ కోసం వెళ్లవద్దని పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాతో చెప్పాడు.
ఇక్కడ నుంచే ఈ వివాదం మొదలైంది. దీంతో మ్యాచ్ రిఫరీ క్రీడా స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించాడని వెంటనే అతడిని ఆసియాకప్ నుంచి తప్పించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసింది.
అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పుడు వరకు ఇండియన్ టీమ్ మెనెజ్‌మెంట్ సూచన మేరకే పై క్రాప్ట్.. నో షేక్ హ్యాండ్ కోసం అఘాకు చెప్పాడని అంతా అనుకున్నారు. కానీ టైమ్స్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. పీసీబీ ఛీఫ్ మొహ్సిన్ నఖ్వీ హెడ్‌గా ఉన్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ సూచనల మేరకే పై క్రాప్ట్ నో షేక్ హ్యాండ్ గురించి సల్మాన్ అఘాకు తెలియజేశాడంట.
"హ్యాండ్ షేక్ వివాదంతో ఐసీసీకి సంబంధం ఏంటి? మ్యాచ్ అధికారులను నియమించడంతో ఐసీసీ పాత్ర ముగిస్తోంది. ఆ తర్వాత అంతా ఏసియన్ క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలోనే జరుగుతోంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఏసీసీ నుంచి ఒకరు పైక్రాఫ్ట్‌తో మాట్లాడారు.
దాని ఫలితమే టాస్ వద్ద మనం చూశాము. పైక్రాప్ట్‌తో ఎవరు మట్లాడారు..? దేని గురించి చర్చించారో తెలుసుకోవాల్సి బాధ్యత ఏసీసీ చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీపై ఉంది. అంతే తప్ప ఈ వివాదాన్ని మరింత తీవ్రం చేస్తూ ఐసీసీ వైపు వేలు చూపిస్తే ఫలితం ఉండదు అని ఐసీసీ వర్గాలు వెల్లడించాయి.
చదవండి: సూర్య గ్రేట్.. మా ఐన్‌స్టీన్ మాత్రం తొలుత బ్యాటింగ్ తీసుకున్నాడు: షోయబ్ అక్తర్