టీ20 ప్రపంచకప్-2026లో పాల్గోనేందుకు బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు వస్తుందా? లేదా అన్నది? జనవరి 21న తేలిపోనుంది. భద్రత కారణాలను సాకుగా చూపుతూ తమ జట్టును వరల్డ్‌కప్ కోసం భారత్‌కు పంపబోమని బంగ్లా క్రికెట్ బోర్డు మొండి పట్టుతో ఉన్న సంగతి తెలిసిందే. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని ఇప్పటికే పలుమార్లు ఐసీసీకి బీసీబీ విజ్ఞప్తి చేసింది.
అందుకు సమాధానముగా ఆఖరి నిమిషంలో షెడ్యూల్‌ను మార్చడం కుదరదని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తెల్చిచేప్పేసింది. తాజాగా శనివారం ఢాకాలో ఐసీసీ ప్రతినిధి బృందం, బీసీబీ అధికారుల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. భారత్‌లో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని ఐసీసీ హామీ ఇచ్చినా బీసీబీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
ఈ క్రమంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ వస్తుందా లేదా అనే విషయం చెప్పేందుకు జనవరి 21ని తుది గడువుగా ఐసీసీ నిర్ణయించినట్లు సమాచారం. ఒకవేళ బంగ్లాదేశ్ తన మొండిపట్టు వీడకుంటే.. ఆ స్థానంలో స్కాట్లాండ్ జట్టును చేర్చాలని ఐసీసీ భావిస్తుందంట. ఐసీసీ ర్యాంకింగ్స్ బంగ్లాదేశ్ తర్వాతి స్దానాల్లో జింబాబ్వే, ఐర్లాండ్, స్కాట్లాండ్ ఉన్నాయి. అయితే జింబాబ్వే, ఐర్లాండ్ జట్లు ఇప్పటికే ఈ మెగా టోర్నీకి అర్హత సాధించగా.. తర్వాత స్దానంలో ఉన్న స్కాట్లాండ్‌కు బంగ్లా స్దానంలో అవకాశం దక్కనుంది.
కాగా గత కొంతకాలంగా బంగ్లాదేశ్-భారత్ మధ్య రాజకీయ ఉద్రిక్తలు నెలకొన్నాయి. అయితే ఐపీఎల్ 2026 నుంచి బంగ్లా స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ విడుదల చేయడంతో ఈ ఉద్రిక్తలు క్రికెట్‌కు పాకాయి. బంగ్లాలో హిందువలపై దాడులు పెరిగిపోతుండడంతో బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్ ఈ నిర్ణయం తీసుకుంది.
దీంతో ఘోర అవమానంగా భావించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. తమ జట్టును వరల్డ్‌కప్ కోసం భారత్ పంపబోమని, వేదికలను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది. అంతేకాకుండా ఐపీఎల్ ప్రసారాలను తమ దేశంలో బంగ్లా ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఇక షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ తమ గ్రూప్ మ్యాచ్‌లను కోల్‌కతా, ముంబై వేదికలగా ఆడాల్సి ఉంది.
చదవండి: T20 World Cup 2026: సౌతాఫ్రికాకు భారీ షాక్


