
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి టీ20లకు, టెస్టులకు వీడ్కోలు పలికినప్పటికి అంతర్జాతీయ క్రికెట్‌లో తన రికార్డుల వేట మాత్రం కొనసాగిస్తున్నాడు. విరాట్ కోహ్లి మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ఆల్‌టైమ్ టీ20 ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లి రేటింగ్ పాయింట్స్‌ను అప్‌డేట్ చేసింది.
కోహ్లి రేటింగ్ పాయింట్స్ 897 నుంచి 909కి పెరిగాయి. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడు ఫార్మాట్లలో 900 ప్లస్ రేటింగ్ పాయింట్స్ అందుకున్న తొలి ప్లేయర్‌గా కింగ్ కోహ్లి వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇప్పటికే విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్‌లో అత్యధికంగా 937 రేటింగ్ పాయింట్స్ సాధించగా.. వన్డేల్లో అతడి పేరిట 909 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి.
ఓవరాల్‌గా ఆల్ టైమ్ టీ20 ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ డేవిడ్ మలన్ 919 రేటింగ్ పాయింట్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సూర్యకుమార్ యాదవ్ 912 రేటింగ్ పాయింట్స్‌తో నిలిచాడు. వీరిద్దరి తర్వాత స్ధానంలో కోహ్లి ఉన్నాడు.
కోహ్లి తన కెరీర్‌లో 125 అంతర్జాతీయ టీ20లు ఆడి 48.69 సగటుతో 4,188 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా టెస్టుల్లో 123 మ్యాచ్‌లు ఆడి 9230 పరుగులు చేశాడు. అందులో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. కోహ్లి రికార్డు స్ధాయిలో 51 వన్డే సెంచరీలు చేశాడు.
చదవండి: IND vs ENG: 'తప్పేమి కాదు.. అతడు తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోవాలి'