
అండర్సన్-సచిన్ టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో 22 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో టీమిండియా పోరాడినప్పటికి విజయం సాధించలేకపోయింది.
దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-2 తేడాతో గిల్ సేన వెనకబడింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ప్లేయర్ మదన్‌లాల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని తన టెస్టు రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోవాలని మదన్‌లాల్ కోరాడు. కోహ్లి అవసరం జట్టుకు ఉందని, తన అనుభవాన్ని యువ ఆటగాళ్లతో పంచుకోవాలని అతడు అభిప్రాయపడ్డాడు.
విరాట్ కోహ్లికి భారత క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. అతడు తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుని, టెస్టుల్లో తిరిగి ఆడాలని నేను కోరుకుంటున్నాను. విరాట్ తన నిర్ణయాన్ని మార్చుకోవడంలో తప్పులేదు. ఈ సిరీస్‌లో కాకపోయినా, తదుపరి సిరీస్‌లో అతడు తదుపరి టెస్టు సిరీస్‌లోనైనా ఆడాలి.
అతడు ఇంకా ఇప్పటికి చాలా ఫిట్‌గా ఉన్నాడు. ఒకటి రెండేళ్లు ఈజీగా ఆడగలడు. తన అనుభవంతో యువ ఆటగాళ్లను రాటుదేల్చాలి. అతడు రిటైర్మెంట్ ప్రకటించి ఎక్కువ రోజులు కాలేదు, కాబట్టి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే బాగుంటుంది" అని క్రికెట్ ప్రీడిక్టాలో మదన్‌లాల్ పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్ పర్యటనకు ముందు విరాట్ కోహ్లి టెస్టులకు వీడ్కోలు పలికి అందరికి షాకిచ్చాడు. అతడికంటే ముందు కెప్టెన్ రోహిత్ శర్మ రెడ్‌బాల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. విరాట్ కోహ్లి తన టెస్టు కెరీర్‌లో 123 మ్యాచ్‌లు ఆడి 9230 పరుగులు చేశాడు. అందులో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
చదవండి: జితేశ్ శర్మకు అవమానం.. దినేశ్ కార్తిక్ కూడా పట్టించుకోలేదా?