అనుకున్నది సాధించేందుకు,అద్భుతాల సృష్టించేందుకు వయసుతో పనిలేదని నిరూపిస్తున్నారు లేటు వయసు సిటిజన్లు. ఇటీవల ఉత్తర ప్రదేశ్‌కు చెందిన 70 ఏళ్ల వినోద్ కుమార్ శర్మ తొలి వ్లాగ్‌లొ అద్భుతమైన వ్యూస్ సాధించి వార్తల్లో నిలిచాడు. ఏదో సరదాగా చేసిన వ్లాగ కేవలం 72 గంటల్లోనే 3 కోట్ల వ్యూస్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. సంకల్ప ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదంటూ నిరూపిస్తున్న మరో 70 ఏళ్ళ మహిళ ప్రస్తుతం నెట్టింట సందడిగా మారారు.
ఇన్‌స్టాగ్రామ్ బయో ప్రకారం, సంగ్వాన్ 68 సంవత్సరాల వయసులో వెయిట్ లిఫ్టింగ్ ప్రారంభించారు. ఆమె ఆర్థరైటిస్ పేషెంట్ , ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్. రోష్ని దేవి సంగ్వాన్ (70) ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్‌గా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నప్పటికీ తన బలాన్ని, శక్తిని ప్రదర్శిస్తూ.. ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆమె దృఢ సంకల్పం సోషల్ మీడియా వినియోగదారులను మాత్రమే కాకుండా నటుడు సునీల్ శెట్టితో సహా ప్రముఖులను కూడా ప్రేరణగా నిలిచింది.
ఇదీ చదవండి: పెప్సికో ఇండియా కీలక బాధ్యతల్లో సవితా బాలచంద్రన్
ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్ అయిన రోష్ణి దేవి సంగ్వాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన కొత్త వీడియో 14 మిలియన్లకు పైగా వ్యూస్‌తో తెగ వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో సన్నీ డియోల్, అహాన్ శెట్టి , వరుణ్ ధావన్ కీలక పాత్రల్లో నటించిన కొత్త చిత్రం బోర్డర్ 2 మూవీలోని ఘర్ కబ్ ఆవోగే పాటకు సెట్ చేశారు. సునీల్ శెట్టి , సన్నీ డియోల్ ఈ రీల్‌పై వ్యాఖ్యానిస్తే, 40 ఏళ్ల తరువాత సినిమా హాల్‌లో బోర్డర్ 2 సినిమా చూస్తుంది అనే క్యాప్షన్‌తో ఈ వీడియో పోస్ట్ కావడం విశేషం. దీంతో "మీరు చాలా స్ఫూర్తి మంతులు. జై హింద్ జై భారత్," సునీల్ శెట్టి వ్యాఖ్యానించారు. చాలా బావుంది మేడమ్ అంటూ ఆయన కుమారుడు అహన్ శెట్టి కూడా స్పందించారు.

కాగా రోష్ణి దేవి సంగ్వాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో 116 వేలకు పైగా అనుచరులను కలిగి ఉన్నారు. సంగ్వాన్ 103 కిలోల బరువును డెడ్‌లిఫ్టింగ్ చేయడం గమనార్హం. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నఆమె, జీవనశైలిలో మార్పులు, కష్టమైనవ్యాయామం సవాలుతో కూడుకున్నది అయినప్పటికీ, శరీరం చెప్పినట్టుగా విని కాలక్రమేణా తన బలాన్ని తిరిగి పొందగలిగినట్టు చెప్పారు.


