
భారతీయ సంతతికి చెందిన విధు ఇషిక (Vidhu Ishiqa) మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్ (Mrs Earth International 2025) అందాల పోటీ కిరీటం గెల్చుకుంది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఈ విజయం ప్రతీ అమ్మాయి విజయం అని పేర్కొంది. అంతేకాదు తన జీవితంలో ప్రతీ బ్రేక్ డౌన్‌కు ఇది పండగ లాంటిదని తెలిపింది. ఇది కేవలం కిరీటం కాదు-ప్రతీ బ్రేక్ డౌన్, ప్రతీ బౌన్స్-బ్యాక్, భయం కంటే లక్ష్యాన్ని ఎంచుకున్న ప్రతీ క్షణానికి సంబంధించిన వేడుక అంటూ ఒక భావోద్వేగ సందేశాన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఆమెకు అభినందనల వెల్లువ కురిసింది.
మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్ అనేది పర్యావరణ అవగాహనను ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్వహించే అంతర్జాతీయ అందాల పోటీ. ప్రతి సంవత్సరం, వివిధ దేశాల నుండి పోటీదారులు ఇందులో పాల్గొంటారు. అలా దేశ విదేశాలనుంచి వచ్చిన పోటీ దారులను ఓడించి విధు ఇషిక టైటిల్ దక్కించుకుంది. తద్వారా ఎందరో అమ్మాయిల కలలకు ప్రేరణగా నిలిచింది.

మిసెస్ ఇండియా యూనివర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో విధు ఇషికను అభినందించింది. భారతీయ సంతతికి చెందిన అమ్మాయి విధు మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్ 2025 ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. దేశం గర్వపడేలా చేసిందని కొనియాడింది. మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్ 2025 అందాల కిరీటీ దక్కించుకునిభారతీయులు గర్వపడేలా చేసిందనీ తెలిపింది. మరోవైపు తనను అభినందించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపింది విధు.
విధు ఇషిక సింగర్ కూడా. పర్యావరణ అనుకూల ఫ్యాషన్‌ను ప్రోత్సహించే గ్లామ్‌గువా (GLAMGUAVA) అనే ఫ్యాషన్ ప్లాట్‌ఫామ్‌ను కూడా స్థాపించింది 2024లో మిసెస్ ఎర్త్ 2024 అవార్డు కూడా గెల్చుకుంది. విధు ఈ ప్రయాణం అంత ఈజీగా ఏమీ సాగలేదు. ప్రతీ అడ్డంకినీ, కష్టాన్ని మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొంది. తనను తాను నమ్ముకొని నిగ్రహంతో అడుగులు వేసింది. టీవీ షోల దగ్గరినుంచి అంతర్జాతీయ ర్యాంప్‌ల వరకు, సింగర్‌గా, స్థిరమైన ఫ్యాషన్ ప్లాట్‌ఫామ్ ఫౌండర్‌గా ఒక మహిళ ధైర్యసాహసాలు ఎలా ఉంటాయో ప్రపంచానికి చూపించింది.