టీనేజ్ అమ్మాయిల నుంచి నడి వయసు మహిళల వరకు.. ఒత్తిడి తగ్గించి, మానసిక ప్రశాంతతను పెం΄÷ందిస్తూ, వెన్నునొప్పిని నియంత్రించేలా చేస్తుంది పశ్చిమోత్తనాసనం. ఈ భంగిమ కూర్చుని చేస్తాం. ‘పశ్చిమ’ అంటే శరీరంలోని వెనుక భాగం,‘ఉత్తాన’ అంటే పూర్తిగా వంగడం, ‘ఆసనం’ అంటే భంగిమ. ఈ ఆసనం లో తల నుంచి మడమల వరకు ఉన్న వెనుక భాగం మొత్తం బాగా లాగబడుతుంది. ఈ ఆసనం వెన్నెముకను దృఢంగా చేసి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే మనస్సుకు శాంతిని కలిగించి, ఒత్తిడిని తగ్గిస్తుంది. ఉదయం లేదా సాయంత్రం రోజూ పది నిముషాలు ఈ ఆసనాన్ని సాధన చేస్తే మెరుగైన ప్రయోజనాలు పొందవచ్చు. కంప్యూటర్‌తో పని చేసే వాళ్లు వెన్ను, మెడ, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు సులువైన, తేలికైనా పశ్చిమోత్తనాసనం ఆసనం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.
– పి. అనిత, యోగా ట్రైనర్


